చిన్ననాటి ఆటలు: వైకుంఠపాళి, అష్టా-చెమ్మా..!!

నేను చిన్నతనంలో ఆడిన ఆటలు గుర్తుతెచ్చుకొంటున్నప్పుడు, పరుగులు పెట్టి కిందపడి మోచేతులకీ, మోకాళ్ళకీ దెబ్బలు తగిలించుకొన్న ఆటలే కాక, బుద్ధిగా ఇంటిలో నీడ పట్టున కూర్చుని ఆడిన ఆటలు కూడా కొన్ని గుర్తుకువచ్చాయి. ముఖ్యంగా వేసవి సెలవల్లో, మండే రోహిణీకార్తె ఎండల్లో, మద్యాహ్న సమయాల్లో ఇలాంటి ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం. వాటిల్లో ముందుగా గుర్తుకు వచ్చేవి వైకుంఠపాళి, అష్టా-చెమ్మా.

ఈ ఆటలు ఆడడానికి కావలసిన ముఖ్యవస్తువులు: నప్పులు, గవ్వలు. “నప్పు” ఒక ఆటగాడియొక్క చిహ్నం. ఈ ఆటలో పాల్గొనే ప్రతీ ఆటగాడికీ వేరే వేరే ఆకారాలు లేదా రంగులున్న నప్పులు ఉంటాయి. అప్పట్లో మేము చీపురు పుల్లలనీ, బలపాలనీ, రాళ్ళనీ, చింతగింజలనీ నప్పులుగా ఉపయోగించేవాళ్ళం. ఇక ఈ నప్పులను ఎంత దూరం నడపాలో నిర్ణయించడానికి కావలసినవి గవ్వలు. ఇప్పటి పిల్లలు ఈ ఆటలను “డైస్” తో ఆడుతున్నారు. సాధారణంగా నాలుగు ఒకే పరిమాణం గల గవ్వలను ఆటకు ఉపయోగిస్తారు. ఈ గవ్వలను ఆటగాడు విసిరినప్పుడు ఎన్ని గవ్వలు వెల్లకిల పడితే నప్పు అంత దూరం జరపవలసి ఉంటుంది. నాలుగు గవ్వలూ వెల్లకిల పడితే “చెమ్మ” అనీ, నాలుగూ బోర్లా పడితే “అష్ట” అనీ అంటారు. “చెమ్మ” అంటే నాలుగు, “అష్ట” అంటే ఎనిమిది. ఇవి పడినప్పుడు ఆ ఆటగాడికి మరల గవ్వలు విసిరే అవకాశం ఉంటుంది. కానీ అదే, మూడు సార్లు అష్ట లేదా చెమ్మ పడితే, నప్పును జరిపే అవకాశాన్ని కోల్పోతాడు.

వైకుంఠపాళి ఆటనే ఇప్పటి పిల్లలు Snakes & Ladders పేరుతో ఆడుతున్నారు. కానీ నాకు ఇప్పటి గట్టి అట్టపై రంగురంగుల గళ్ళతో, చిన్నగా ఉండే బోర్డుకన్నా, నలుపు, తెలుపు రంగులలో, పెద్దగా, “పరమపద సోపాన పటము” అని రాసిఉండే పాత కాగితం పటమే ఎంతో ఇష్టం. ఈ ఆటలో 1 నుంచీ 100 వరకూ అంకెలు, అడ్డువరుసకు 10 గళ్ళ చొప్పున ఉంటాయి. ఈ పటంలో అక్కడక్కడా పాములూ, నిచ్చెనలూ వ్యాపించి ఉంటాయి. నప్పు చేరుకున్న గడిలో పాము తల ఉంటే, ఆ పాము మింగటం చేత, ఆ గడి నుంచీ పాము తోక ఉన్న గడి దాకా నప్పు దిగజారవలసి ఉంటుంది. అదే, నప్పు పడిన గడిలో నిచ్చెన కింది చివర ఉంటే, ఆ నిచ్చెన ఎక్కడం ద్వారా, నిచ్చెన పై చివర వరకూ చేరుకోవచ్చు. పాములను దాటుకొంటూ, నిచ్చెనలు ఎక్కుకొంటూ, 100వ గడికి ముందుగా చేరుకొన్నవాడే విజేత. ఇప్పటికీ, 94వ గడినుంచీ అనుకొంటా, అట్టడుగు వరుస వరకూ వ్యాపించి ఉండే అతి పెద్ద పామును తలచుకొంటే, ఎన్నిసార్లు ఆ పాము బారిన పడి ఆటను కోల్పోయామో గుర్తుకువచ్చి నవ్వు వస్తుంది.

ఇక ఇదే కోవలొకి వచ్చే మరో ఆట “అష్టా-చెమ్మ”. దీనినే “గవ్వలాట” అనికూడా అంటారు. ఇది ఇప్పటి తరం వారు ఆడే “Ludo” ఆటను పోలి ఉంటుంది. ఈ ఆటకు కావలసిన పటాన్ని అరుగుమీద గీసుకొనే వాళ్ళం. దీనికి నీటితో తడిపిన సుద్దముక్కను ఉపయోగించే వాళ్ళం. ఈ పటం 5 అడ్డు వరుసలు, 5 నిలువు వరుసలతో కూడి చతురస్రాకారంలో ఉంటుంది. ఈ ఆటలో నలుగురు ఆటగాళ్ళు, పటానికి నాలుగు వైపులా కూర్చొని ఆడతారు. ప్రతీ ఆటగాడికీ, తనవైపుగా బయట వరుసలో ఉన్న 5 గళ్ళలో, మధ్య గడిలో “X” గుర్తు వేసి ఉంటుంది. ఇందులో ఆ ఆటగాడికి చెందిన నాలుగు నప్పులు ఉంటాయి. ఇది ఆ ఆటగాడి “ఇల్లు” అంటారు. ఈ గడే కాక, పటంలో లోపలగా మధ్యలో ఉన్న గడిలోనూ, మరి కొన్ని గళ్ళలోనూ “X” గుర్తు వేసి ఉంటుంది. వీటిని విరామ స్థానాలు అనవచ్చు. ప్రతీ ఆటగాడూ, తన నాలుగు నప్పులనూ అపసవ్య దిశలో నడుపుకొంటూ, చివరకు మధ్యలో “X” గుర్తు ఉన్న గడికి చేర్చవలసి ఉంటుంది. ఏ ఆటగాడి నప్పులు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకొంటే అతడే విజేత. ఆటగాడు తన నాలుగు నప్పుల్లో దేనిని జరుపుతాడు అనేది అతని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారికి ఒక నప్పునే జరుపవలసి ఉంటుంది. ఈ ఆటలో నియమాలు ఇవే అయితే మజా ఏముంటుంది..? అసలు మజా అల్లా ఒక ఆటగాడి నప్పులను మరొకరు చంపుకోవడంలో ఉంటుంది. ఒక ఆటగాడి నప్పు “X” గుర్తు లేని గడిలో ఉన్నప్పుడు, రెండవ ఆటగాడి నప్పు అదే గడిలోకి వచ్చి చేరితే, రెండవ ఆటగాడి నప్పు, మొదటి ఆటగాడి నప్పును చంపినట్టు లెక్క. అప్పుడు మొదటి ఆటగాడి ఆ నప్పు, అతని ఇంటికి చేరుతుంది..!! ఆ నప్పును అతడు మరల మొదటినుంచే నడుపుకు రావలసి ఉంటుంది. “X” గుర్తు గడిలో ఉన్న నప్పును ఏ నప్పూ చంపలేదు. ఇలా ఒకరి నప్పులు ఒకరు చంపుకొంటూ, కసితో, ఉత్సాహంతో, రసవత్తరంగా సాగుతుంది ఈ ఆట. మా బామ్మ ఈ ఆటను, తన స్నేహితురాళ్ళతో ఇంటి అరుగుల మీద కూర్చొని ఆడుతూ ఉండేది. ఆవిడకు అత్యంత ఇష్టమైన ఆటలు గవ్వలాట మరియు పేకాట. ఆవిడ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి చాలాకాలం అయినా, గవ్వలు పేరు చెప్పగానే మా ఇంట్లో అందరికీ ఆవిడే గుర్తుకు వస్తుంది…!!

32 comments on “చిన్ననాటి ఆటలు: వైకుంఠపాళి, అష్టా-చెమ్మా..!!

 1. tethulika అంటున్నారు:

  ఎన్నాళ్లకి విన్నానండీ ఈఆటలంటే సరదా పడేవారున్నారని. ముఖ్యంగా వైకుంఠపాళీ, పరమపదసోపానపటంలో కేవలం ఆటే కాకుండా జీవనసరళిమీద వ్యాఖ్యానం అని ఎంతమందికి గుర్తుందో?

 2. లక్ష్మణ్ అంటున్నారు:

  నప్పులకు మరో పేరు పావులనుకుంటా. మా ఇంటి అరుగుల మీద ఈ ఆటల పటాలు అచ్చులు వేసి ఉండేవి, పర్మినెంట్ గా. ఇవేకాక, వేరే ఆట పాచికలతో ఆడేది (పచ్చీసు? దాయాలు?) కూడా ఉండేది. ఇత్తడో, కంచో! లోహపు పాచికలు తిరుమల నించి తెప్పించేవారు. మా జట్టు, మా బాబాయి జట్టు ఆడుతుంటే పిచ్చి మజా వచ్చేది. మా నాయనమ్మ చెబుతూ ఉండేది ఆట్టే ఆడమాకండి దాయాదులకు గొడవలొస్తాయని. అప్పట్లో మేము పట్టించుకోలేదు. కారణం తెలియదు. చాలా యేళ్ళకు, ఆడగా ఆడగా విరోధాలు ప్రారంభమయ్యాయి. ఆస్తులు పంచబడ్డాయి. ఇల్లు కూలగొట్టబడి, మధ్య ఒక పెద్ద గోడతో రెండు భవనాలు వెలిశాయి.

 3. యామజాల సుధాకర్ అంటున్నారు:

  వైకుంఠపాళి ఆ 94 వ గడి దగ్గర ఉండే పెద్ద పాము పేరు అరుకాషురుడు. ఎవరి దగ్గరైనా వైకుంఠపాళి స్కాన్ చేసినది ఉంటే బాగుణ్ణు.
  ఈ ఆటలు గుర్తుకు చేసినందుకు ధన్యవాదములు.

 4. tethulika అంటున్నారు:

  నాదగ్గర వుంది. స్కాన్ కాదు కానీ డిజిటల్ కెమెరాతో తీసిన ఫోటో. మీకు కావాలంటే ఈమెయిల్ చెయ్యగలను.

 5. యామజాల సుధాకర్ అంటున్నారు:

  ఆహా మహాద్భాగ్యం. ఆ డిజిటల్ కెమెరాతో తీసిన ఫోటోని నా ఈమెయిల్ ఐడీ కి పంపగలరు.
  నా ఐడి yssudhakar@gmail.com

 6. రాజారావు తాడిమేటి అంటున్నారు:

  దయచేసి నా ఈ-మెయిల్ t_rajarao@yahoo.com కు కూడా పంపండి. మీరు ఒప్పుకొంటే ఆ చిత్రాన్ని నా ఈ టపాకు జతచేస్తాను.

 7. tethulika అంటున్నారు:

  మీ ఇమెయిలులకి బొమ్మ పంపుతున్నాను. మీరు ప్రచురించుకోడానికి నాకు అభ్యంతరం లేదు.
  మాలతి.

 8. hayagreevadutt అంటున్నారు:

  hello,
  I too know those games. I and my sister were played those games with out friends. Very happy that after so many years we have been recollecting those days and games.

 9. Rajeshanumula అంటున్నారు:

  hi sir ,
  blog is very nice….

 10. ramprasad అంటున్నారు:

  sir,

  those games u mentioned in the blog was played by our children in hoidays .we also enjoyed very much by playing these games in summer holidays. But today, nobody interested in playing games like asta chemma, chintagingalu, vaikuntapali, chemma chekka. Westernization swaps all the traditional games. But the same time the names have changed like snake @ ladder, ludo, mancala , etc.,

  anyway we should pass our past glorious culture to the coming generation children.

  I will be with you in this regard

  thank you

  ram prasad

 11. anilkumarkasavar అంటున్నారు:

  corporate schools and the IT hubs are making the children to avoid any type of game which boy or girl going to playground in the evening everybody is running to tutions . These are our sweet memories only

 12. చంద్రకిరణ్‍ అంటున్నారు:

  నమస్కారం, ఆటలగురించి మిరు ఇచ్చిన సమాచారం మాకు చాలా ఉపయోగపడింది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు మాండలిక పదకోశాన్ని తయారుచేస్తున్నారు. అందులో నేనుకూడా ప్రాజెక్ట్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాను. దయచేసి మీకు తెలిసిన మాండలిక పదాలను మాకు పంపండి
  చంద్రకిరణ్‍
  swarnakiranam@gmail.com

 13. చంద్రకిరణ్‍ అంటున్నారు:

  మస్కారం, ఆటలగురించి మిరు ఇచ్చిన సమాచారం మాకు చాలా ఉపయోగపడింది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు మాండలిక పదకోశాన్ని తయారుచేస్తున్నారు. అందులో నేనుకూడా ప్రాజెక్ట్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాను. దయచేసి మీకు తెలిసిన మాండలిక పదాలను మాకు పంపండి
  చంద్రకిరణ్‍
  swarnakiranam@gmail.c

 14. స్వామి.నద్దునూరి అంటున్నారు:

  మీరు ఇచ్చే సమాచారము చాల ఉపయోగకరముగా ఉంది దానిని చదివి సంతీసించాము మావిన్నపము మాకు పాముల గూర్చి తెలియజేయగలరని కోరుచున్నమూ

 15. rameshraju అంటున్నారు:

  I KNOW HOW TO PLAY PULI JOODAMU, ASHTA CHEMMA (CHAUKA BHARA), PARAMAPADA SOPANAMU, NELA BANDA (OONCH NEECH KA PAAPADA), DAAGUDU MOOTALU, YEDU PENKULAATA (LAGORI), ACHENAGANDLU (5 STONE GAME), TOKKUDU BILLA (HOPSCOTCH), GILLI DANDA (GOOTI BILLA OR KARRA BILLA), CHENDAATA (KOKLA CHAPAKI), KOTHI KOMMACHI, RAAMUDU SEETHA, GUDUGUDU GUNCHAM ETC. I EVEN WROTE A BOOK BY NAME TRADITIONAL SPORTS AND GAME OF ANDHRA PRADESH. THEY ARE GOING TO BE REVIVED IN http://WWW.ONLINEREALGAMES.COM.

 16. rameshraju అంటున్నారు:

  PARAMAPADA SOPAANA PATAMU IS A TELUGU VERSION OF SNAKES AND LADDERS. LET ME TELL THE HISTORY OF SNAKES AND LADDERS: IN 2000 BC, BUDDIST MONKS HAVE MADE A GAME CALLED LEELA, WHICH CONSISTED OF SNAKES AND ARROWS. THE GAME WAS MADE TO TEACH MORALS AND ETHICS TO CHILDREN. LEELA MEANS THE GAME OF KNOWLEGE. HINDUS NAMED THEIR VERSION AS GYAN CHAUPAR OR MOKSHAPAT. JAINS NAMED THEIR VERSION AS GYAN BAGI, WHICH MEANS THE GAME OF HEAVEN AND HELL. IN 19TH CENTURY, VICTORIANS OF ENGLAND HAD REMOVED RELIGIOUS MORALS AND ETHICS FROM LEELA, REPLACED THE ARROWS WITH LADDERS AND NAMED THE NEW GAME AS SNAKES AND LADDERS. IN 1943, WHEN SNAKES AND LADDERS WAS INTRODUCED, THE SNAKES IN IT WERE REPLACED BY CHUTES AND THEY CALLED ‘CHUTTES AND LADDERS’.

 17. rameshraju అంటున్నారు:

  ERRATA IN THE ABOVE COMMENT

  IN 1943, SNAKES AND LADDERS WAS INTRODUCED TO UNITED STATES. THEY REPLACED THE SNAKES WITH CHUTTES AND RENAMED THE GAME AS CHUTTES AND LADDERS.

 18. rameshraju అంటున్నారు:

  We are introducing the traditional games of andhra pradesh. they include Puli Joodamu, Ashta Chemma (Thaayam), Daadi (Merelles), Vaamana Guntalu (pallanguli), Vaikuntapali, Tokkudu billa (Hopscotch), Goleelu (Marbles), Gilli Danda (Gootibilla/karra billa), 7 penkulaata (lagori), Achenagandlu (5 stones), Chendata (Kokla Chapaki), Daagudu Mootalu, Kothi Kommachi, Raamudu Seeta, Gudugudu guncham etc. in http://www.onlinerealgames.com this year onwards. For further information mail me to
  rameshrajuartist@gmail.com

 19. Appaji Ambarisha Darbha అంటున్నారు:

  I really enjoyed the effort of Rajarao garu. For the last few months I tried to gather the game data and what I gathered is all here. I love this game since my childhood. New generation should know these ancient Indian games. I downloaded the digital camera image of Vaikunthapali and improved it a bit using photoshop. Anyone wants to have it can mail me. So that I can send them. Nice effort Rajarao garu.

 20. kiran అంటున్నారు:

  Could you please send me the scanned copy of Vaikunthapalo or ParamapadaSopanaPatam.

  thanks in advance
  Kiran

 21. rameshraju అంటున్నారు:

  please download game boards of

  Vaikuntapali, Puli Joodamu, Ashta Chemma, Paachikalu in
  http://www.onlinerealgames.com community page.

 22. phani అంటున్నారు:

  naku kuda scan chesina vikuntapali pic pampandi pls.
  yphani2007@gmail.com

 23. shilpa అంటున్నారు:

  i recalled my childhood memories. thank u.
  could u please send me the vaikuntapali/paramapadasopaanam chart please.
  my id is
  shilpa.kameshwari@gmail.com

 24. sravya అంటున్నారు:

  sir! I am so happy to recollect my childhood games.send me a copy of vykuntapali or padamapadasopanam to my email id i.e., suryasravani@yahoo.in…..pls

 25. sreedhardv అంటున్నారు:

  రాము, నాక్కూడా గుర్తే మీ బామ్మగారు అరుగుమీద అష్ట చెమ్మా ఆడటం 🙂

 26. Sri అంటున్నారు:

  enta chutes and ladder, parcheesilu unna mana vaikuntapali makes us feel good-naaku kooda mail chestara vaikuntapali game pls–sri_gutta@yahoo.com

 27. newwaysoflife అంటున్నారు:

  mee prayatnamunaku dhanyavadamulu

 28. Prasad అంటున్నారు:

  maa chinnanati aatalu gurtuku vasthunnai

 29. నరేష్ కుమార్ యక్కల అంటున్నారు:

  మన సాంప్రదాయ ఆటల ను ఇష్టపడే మీ అందరికోసం మరియు ఇలాంటి ఆటలు కనుమరుగు అవకుండా ఉండేందుకు నేను అష్టా చమ్మా ని మొబైల్ లో ఆడుకొనే లా తయారు చేసాను. మీ దగ్గర ఆండ్రాయిడ్ గనుక ఉంటే ఈ క్రింది లింక్ ద్వారా దిగుమతి చేసుకొనగలరు.

  https://m.facebook.com/indianludogame

  మీకు ఆట నచ్చితే దయచేసి మంచి రేటింగు ఇవ్వండి

  దన్యవాదములు,
  నరేష్ కుమార్ యక్కల

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s