చిన్ననాటి ఆటలు: సబ్జా – విండూర్

నేను నా బ్లాగులో టపా వేసి వారం కావస్తోంది. తరువాత ఏమి రాద్దామా అని ఆలోచిస్తూండగా, నా చిన్నతనంలో మేమాడుకొన్న ఆటల గురించి రాస్తే బాగుంటుందనిపించింది. ఎంతో మానసిక వికాసాన్నీ, శారీరక వ్యాయామాన్నీ, మరచిపోలేని అనుభూతులనీ, మిత్రులనీ అందించిన ఈ ఆటల గురించి ఒక్క టపాలో రాస్తే సరిపోదనిపించింది. అందుకే ప్రతీ వారం ఒక్కొక్క ఆటని గుర్తు చేసుకొంటూ, ఆ జ్ఞాపకాలను ఈ బ్లాగులో పదిలంగా దాచుకోవాలని, తోటి బ్లాగు స్నేహితులతో  పంచుకోవాలని నిర్ణయించుకొన్నాను.

సాధారణంగా, మేమాడిన ప్రతీ ఆటలోనూ, క్రీడాకారులనుంచి ఒక “దొంగ” ను ఎన్నుకోవడం ఉండేది. “దొంగ” ను “పంటలు” అనే పద్ధతి ద్వారా ఎన్నుకొనేవాళ్ళం. ముగ్గురు లేదా అయిదుగురం ఒకళ్ళ చేతులు ఒకరు పట్టుకొని వృత్తాకారంలో నించుని అందరూ ఒకేసారి ఎవరి ఎడం అరచేతిలో వారి కుడి అరచేతిని, వెల్లకిలాగానీ, బోర్లాగానీ, ఎవరికి తోచినట్లు వారు ఉంచేవాళ్ళం. ముగ్గురిలో ఒకేలా వేసిన ఇద్దరు కాక మిగిలిన వారు “పంట” అయినట్టు. అదే విధంగా అయిదుగురిలో ఒకేలా వేసిన ఇద్దరు పంట అయినట్టు. చివరకు పంట కాకుండా మిగిలిన వారే దొంగ. ఒకవేళ ఇద్దరు మిగిలితే, అప్పటికే పంట అయిన వారు తోడుకు వచ్చేవారు.

ఇక నాకు చాలా ఇష్టమైన ఆటల్లో మొదటిది “సబ్జా – విండూర్”. పైన చెప్పిన విధంగా దొంగను ఎన్నుకొన్న తరువాత, దొంగ, కళ్ళు మూసుకొని అంకెలు లెక్కబెడతాడు. అతను కళ్ళు తెరిచేలోపు, మిగిలిన అందరూ దొంగకు కనబడకుండా ఎక్కడైనా దాక్కోవాలి (కొన్ని సరిహద్దుల లోపల). దొంగ, దాక్కున్న ప్రతీ ఒక్కరినీ కనుక్కొని, వారి పేరు చెప్తూ “విండూర్” అని అరవాలి. ఈ లోపుగా ఎవరైనా దొంగ వెనుకగా వచ్చి “సబ్జా” అని ముట్టుకొంటే, దొంగ మరల ఆటను మొదలుపెట్టవలసి ఉంటుంది. అలా కాక, దొంగ అందరినీ కనుగొనగలిగితే, మొదటగా విండూర్ అయిన వ్యక్తి మరుసటి ఆటకు దొంగగా ఉండవలసి వస్తుంది.

ఈ ఆటను నా ఎదురింటి స్నేహితుడు”కృష్ణ” ఇంటి పెరడులో ఆడేవాళ్ళం. దొంగకి దొరకకుండా ఉండడానికి, ధాన్యం గాదెలోనో, లేక గడ్డి మేటిలోనో దాక్కునే వాళ్ళం. ఆ దెబ్బకి ఒళ్ళంతా దురదలు వచ్చినా పట్టించుకోనంతగా ఆటలో లీనమైపొయేవాళ్ళం. ఇక దొంగని తప్పుదారి పట్టించడానికి రకరకాల యుక్తులు ఉపయోగించేవాళ్ళం. ముఖ్యంగా నేనూ, కృష్ణా, ఒకరి చొక్కాలు మరొకరు మార్చేసుకొని, దొంగకి పట్టుబడ్డట్టుగా వెనుకనుంచి కనబడేవాళ్ళం. ఒకవేళ చొక్కా ఆనుమాలుతో మనిషి పేరు చెప్పాడా, అతను మళ్ళా దొంగ పెట్టవలసిందే..!!   ఇంతే కాక, పెరట్లో ఉన్న మరుగుదొడ్లలో దూరి తలుపేసుకొని, లోపల కుళాయి తిప్పి, ఎవరో పెద్దవాళ్ళు ఉన్నట్లు దొంగని భ్రమింప చేసేవాళ్ళం. తలుపు సందులోంచి దొంగ యొక్క కదలికలు గమనిస్తూ, అదను చూసుకొని, హఠాత్తుగా దాడి చేసి సబ్జా చెప్పేవాళ్ళం. లేదా, ఒకేసారి ముగ్గురు నలుగురు దొంగపై దూకి ఉక్కిరిబిక్కిరి చేసి, అతను తేరుకొని విడిగా విండూర్ చెప్పేలోపే ఎవరో ఒకరు సబ్జా చెప్పేసే వాళ్ళం.

ఒకసారి ఈ ఆట మొదలుపెడితే అసలు సమయమే తెలిసేది కాదు. సాయంకాలం అయిదు గంటలకు మొదలుపెట్టిన ఆట, చీకటిపడి మా అమ్మలు కేకలు వేసి, చెవి మెలితిప్పి ఇంటికి లాక్కుపోయే దాకా సాగేది. అలసిపోయి, చెమటతో ముద్దైన వంటిపై, నూతి దగ్గిర చన్నీళ్ళ స్నానం చేసి, అన్నం తిని పడుకొంటే, మరుసటి రోజు ఉదయందాకా వళ్ళు తెలిసేది కాదు.

4 comments on “చిన్ననాటి ఆటలు: సబ్జా – విండూర్

  1. kalidasu అంటున్నారు:

    sir, ee aatanu memu RACE, DOPPA ane peruto adevallamu. maadi nalgonda district.

  2. phani అంటున్నారు:

    రాజా రావు అన్నా, ఈ ఆటను మేము ఎక్స్ప్రెస్స్ అనే పేరు తోటి ఆడెటోల్లం. మా వాడలో అన్ని పాత ఇండ్లు ఉంటుండె. ఆ పాత గోడలే మాకు దాక్కోవడానికి జాగ.
    ఫణి

  3. మీ ఆలోచన చాలా బాగుంది. మీకు ఈ ఆలోచనరావటం సంతోషదాయకం. యింక కొన్నాళ్ళ తరువాతైతే పిల్లలకు ఇటువంటి ఆటలున్నాయని కూడా తెలియకుండా పొతాయామో.

    ఇక ఈ ఆటని మేము “దొంగ-పోలీస్” అని, “ఐస్” అనే పేర్లతో ఆడేవాళ్ళం. ఆప్పట్లో మేము మా ఊరి శివాలయం, రామాలయం వాటి చుట్టు పక్కల గల యిళ్ళలో కూడా దాంకొనేవాళ్ళం.

    ఇఫ్ఫుడు పిల్లలెవరు ఈ ఆటను ఆడుతున్నట్లు నేను గమనించలేదు.

  4. aswin kumar malyala అంటున్నారు:

    great theme andi ippatiki nenu chusina vatillo

    Read my articalsteluguvision telugu website

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s