న్యూస్ ఛానళ్ళ తీరుపై “అమృతం” వ్యంగ్యాస్త్రాలు.

నిన్ననే హైదరాబాద్‌లో జరిగిన ఫ్లైఓవర్ దారుణం టివిలో చూసాను. బాధితుల మృతదేహాలు చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. దానికంటే కలచివేసిన దృశ్యాలు ఏమిటంటే ఆ మృతదేహాలను కెమెరాలలో బంధించడానికి రిపోర్టర్లు పడుతున్న ఆతృత. జరిగిన దారుణాన్ని ఎంత తొందరగా ప్రసారం చేసి తమ ఛానళ్ళ రేటింగులు పెంచుకోవాలనే ఆశ తప్ప, జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో ఒక చేయివేసి సాయం అందించాలనే తపన ఒక్కరిలోనూ కనబడలేదు. శిధిలాలలో మూల మూలలకు వెళ్ళి, తమ ప్రాణాలకు సైతం తెగించి, కాళ్ళు, చేతులు నలిగిన వారిని, తలలు చితికిన వారిని ఫొటోలలోనూ, వీడియోలలోనూ ప్రేతకళ ఉట్టిపడేలా చిత్రీకరించి పండుగ జరుపుకున్నారు మీడియా వారు. వీరికీ, శవాలను పీక్కు తినే రాబందులకు పెద్ద తేడా ఏముంది..? సంఘటన జరిగిన నాలుగు గంటలకు గానీ అధికార యంత్రాంగం స్పందించలేదని పత్రికలలో వచ్చింది. ఊరికి ముందరే సంఘటనా స్థలంలో ప్రత్యక్షమైపోయే మీడియా వారందరూ తలా ఒక చేయి వేసిఉంటే కొంతమంది ప్రాణాలయినా కాపాడగలిగే వారు కాదా..?

ఇలా బాధపడుతూ, కొంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందని ప్రతీ ఆదివారం జెమిని చానల్లో ప్రసారమయ్యే “అమృతం” అనే హాస్య ధారావాహిక చూద్దామని కూర్చున్నాను. సరిగా నా మనసులో ఉన్నదే ఆ ధారావాహిక లోని ముఖ్యాంశం. అందులో 24 గంటల పాటు ప్రసారమయ్యే న్యూస్ ఛానళ్ళ తీరుపై సునిశితమైన వ్యంగ్యాస్త్రాలను సంధించారు. చూసిన వెంటనే హాస్యం జనించినా, కొద్ది ఆలోచిస్తే, నిజమే కదా అని అనిపించేలా ఉన్నాయి అందులో సన్నివేశాలు. మచ్చుకు రెండు చెప్తాను.

“అమృతం”, “ఆంజనేయులు” ఒక న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారు. ఒక రోడ్డుపై ఒక ప్రమాదకరమైన మలుపు ఉంటుంది. ఆ మలుపు చివరే ఒక పెద్ద లోయ. ఒక టివి ఛానల్ యాంకర్ అక్కడ కాపు కాచుకుని ఏ వాహనం ఆ మలుపు తీసుకొంటుందా అనిచూస్తూ ఉంటుంది. ఒక్కొక్క వాహనం మలుపు తీసుకోవడం, ఆ లోయలో పడడం, ఆ యాంకర్, ప్రభుత్వాన్నీ, రోడ్డు మరియు భవనాల శాఖ పనితీరుని దుయ్యబడుతూ ఉండటం, ఇలా సాగిపోతూ ఉంటుంది ఆ ఛానల్లోని ప్రసారం. దీని బదులు “ఇటు వైపు పోరాదు” అని ఆ ఛానల్ వారే బోర్డు పెడితే బావుండేది కదా అని ఆక్రోశిస్తాడు అమృతం. 

మరో సన్నివేశంలో, ఒక రోడ్డుపై ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన అక్కడికి చేరుకొన్న ఒక న్యూస్ చానల్ వారు,అక్కడ కొన ఊపిరితో కొట్టుకొంటున్న ప్రయాణీకుడిని చూపి, “ఇతను మరణిస్తాడా..? లేదా..? మీ సమాధానం మాకు SMS చేయండి” అంటూ ఒక పోటీని నిర్వహిస్తారు. ఇది చూసి అమృతం నివ్వెర పోతాడు.

ఇలా ఎన్నో వ్యంగ్యాస్త్రాలతో సాగిపోయింది ఈ వారం “అమృతం” ధారావాహిక. నా మనసులోని భావాలను దృశ్యరూపంలో ఆవిష్కరించిన ఆ ధారావాహికా బృందాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను.

6 comments on “న్యూస్ ఛానళ్ళ తీరుపై “అమృతం” వ్యంగ్యాస్త్రాలు.

 1. మేధ అంటున్నారు:

  అవునండీ, బాగా చెప్పారు.. నాకు కూడ అలానే అనిపించింది.. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళని చూస్తుంటేనే, చిరాకు పుడుతుంది.. నేను మనసులో ఏమని అన్నుకుంటున్నానో, అమృతంలో అదే చూపించారు..

 2. mohan అంటున్నారు:

  I agree with you.

  Now a days media is not constructive. Nothing much about positive things. Whatever we see is negative news and tragedies.

 3. nuvvusetty అంటున్నారు:

  100%……….I agree with you.

 4. shaktiswaroopreddy అంటున్నారు:

  every issue in the universe wiil have advantages and also more or less equal number of disadvantages as a coin has two sides so we cannot blame media and also we cannot appreciate them as they became political now a days.

 5. govardhan అంటున్నారు:

  yes, it is obsolutely right . not only media everyone thinking selfishly.itls very BAD.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s