మా ఊరిలో ఎక్కడ చూసినా “నూలి” వారని, “బొడ్డు” వారని, “గ్రంధి” వారని, ఇలా వైశ్య (కోమటి) కుటుంబాలే ఎక్కువగా కనిపిస్తాయి తప్ప, దుర్భిణి వేసి చూసినా ఒక్క “రాజు” ల కుటుంబం కూడా కనపడదు. ఎందుకో తెలుసా..?
పూర్వం మా ఊరిలో ఒక వైశ్య దంపతులు నివసించేవారు. వారికి “కన్యక” అనే ఒక అందమైన కూతురు వుండేది. ఆమె పెళ్ళీడు కు రావడంచే వివాహం చేయ సంకల్పించి ఒక మంచి వరునికై తల్లిదండ్రులు వేచి చూస్తుండగా, ఒకనాడు అటుగా వెళ్తున్న ఆ ప్రాంత రాజు కన్యక అందాన్ని చూసి, మోహించి, పెళ్ళాడమని బలవంతం చేసెను. ఆ రాజును ఎదిరించలేక, తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళాడలేక, ఆ కన్యక “అగ్ని గుండం” లోకి దూకి ఆత్మత్యాగం చేసింది. అప్పటినుంచి ఆమె “కన్యకా పరమేశ్వరి” అమ్మవారిగా మా ఊరి ప్రజలచే, ముఖ్యంగా వైశ్యులచే పూజలందుకుంటోంది. ఆ “కన్యకా పరమేశ్వరి” ఇచ్చిన శాపం వలననే మా ఊరిలో “రాజు” లు నివసించరు. ఒకవేళ నివసించినా మా ఊరి పొలిమేర అయిన కాలువ దాటిన తరువాతనే ఇళ్ళు కట్టుకొంటారు. ఈ ఆచారం, నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది. మా ఊరి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆమె అగ్నిప్రవేశం చేస్తున్న ప్రతిమను చూడవచ్చు. ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రాంతానికి వెళ్ళినా, మా ఊరు “పెనుగొండ” అంటే, “ఓ.. అమ్మవారి ఊరా..!!” అని చేతులెత్తి భక్తిపూర్వకంగా నమస్కరిస్తారు.
పెను గొండ….!!?? ఏ జిల్లా అండి? పదవ తరగతిలో ‘కన్యక ‘ పాఠం చదువుకున్నాను. కాని ఏ ఊరో తెలియదు.
పచ్చని పశ్చిమగోదావరి లో ఉందండి ఈ పెనుగొండ…
రాజు గారూ,
బుడుగు గారు చెప్పినట్టు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండీ మా పెనుగొండ..
మీ ఇద్దరికీ నా ధన్యవాదములు. అటుగా వెళ్ళినపుడు మా వూరు ను తప్పక చూడండి.