ఒంటరితనం

మనసులో బాధ సుడులు తిరిగింది.
గుండె గొంతుకులో కొట్టుకుంటోంది.
పెగలలేని మాట మూగబోయింది.
కనులలో నీరు పెల్లుబుకింది.

లోలోని వేదన అణచుకోలేను.
అలాగని ఎవరితో పంచుకోలేను.

అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకిని నేను.
ఎవరికీ నేను ఏమీ కాను.