ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. చదవడానికి సిల్లీగా అనిపిస్తాయని ఇన్నాళ్ళూ బ్లాగలేదు కానీ, ఇక ఆగలేను. తెలుగులో మూడు పదాల ఉచ్ఛారణలో నాకు ఎప్పుడూ సందేహం తలెత్తుతూ ఉంటుంది. అంతకీ నా చుట్టుపక్కల కొంతమందిని అడిగినా ఎవరూ సంతృప్తికరంగా నివృత్తి చేయలేకపోయారు. మన బ్లాగుగుంపునుంచీ ఎవరైనా ఆ పని చేయగలరని ఆశతో..
1. బ్రహ్మ Vs బ్రమ్హ: నవ్వుకోకండి..!! మనలో చాలామంది తెలుగులో రాసేటప్పుడు “బ్రహ్మ” అని రాసినా, ఉచ్ఛరించేటప్పుడు “బ్రమ్హ” అని ఉచ్ఛరిస్తారు. చాలామంది దగ్గిర గమనించే ఇది రాస్తున్నాను. మరీ ముఖ్యంగా “ప్రరబ్రహ్మ”, “బ్రహ్మానందం”, “బ్రహ్మాండం”, “సుబ్రహ్మణ్యం” లాంటి పదాల ఉచ్ఛారణలో ఇది ఎక్కువగా గమనించాను. ఏదో టీవీలో న్యూస్‌రీడర్ల వద్ద అయితే ఎక్కువ పట్టించుకోకపోదును. కానీ, “బాల సుబ్రహ్మణ్యం”, “బాల మురళీకృష్ణ” లాంటి ప్రముఖ గాయకుల గాత్రాలలో కూడా ఇది గమనించాను. నా దృష్టిలో మాత్రం “బ్రహ్మ” అని ఉచ్ఛరించడమే సరిఅయినదని అభిప్రాయం. మీలో ఎవరైనా ఈ విషయాన్ని గమనించారా..? మీరు ఏమని ఉచ్ఛరిస్తారు..? మీ అభిప్రాయం ఏమిటి..?
2. కథ Vs కధ: నేను చిన్నప్పుడు తెలుగు రాయడం నేర్చుకొంటున్నప్పుడు, “కథ” కి పొట్టలో చుక్క పెట్టాలని నెత్తిపై మొట్టి మరీ చెప్పేవారు. కానీ ఉచ్ఛరించేటప్పుడు మాత్రం “కధ” అని పలికినా ఏమీ అనేవారు కారు. ఇప్పటికీ నేను “కధ” అనే చాలాసార్లు ఉపయోగిస్తాను. ఇంతకీ సరీయిన ఉచ్ఛారణ ఏమిటి..?
3. ఫలం (Phalam) Vs ఫలం (fhalam): వీటి మధ్య తేడాను వ్యక్తీకరించడానికి ఆంగ్లంలో రాయవలసి వచ్చింది. రాసేటప్పుడు ప, ఫ, బ, భ, మ లలో వత్తు “ఫ” ను ఉపయోగించినా, పలికేటప్పుడు ఆంగ్లంలోని “F” ను ఉపయోగిస్తూంటాము. నేను కూడా సాధారణంగా ఇదే చేస్తాను. కానీ ఇది సరి అయినదేనా..?
మీలో ఎవరికైనా పైన చెప్పిన మీమాంస తలెత్తిందా..? మీ అభిప్రాయాలకై ఎదురుచూస్తూ..
Grandhika Vyavahaarika bhaashaa vytyasam tamari sandheha moolam..
Brahma, Kadha (not KaTha), Phalam are Vyavahaarikam
Brahma(no change) Katha, Falam Grandhikam …
Meeku Nootanotsava subhaabhinandanam,… Subham Bhavatu
చాన్నాళ్ళకు కనిపించారు రాజారావుగారూ!
నాకు తెలిసినదిది:
బ్రహ్మ అని రాస్తాం. పలికేటపుడు బ్రమ్హగా పలుకుతాం (ఇలా పలకాలనేది నియమం కాదేమోననుకుంటాను)
కథ సరైన మాట.
phaలం అనేది సరైనది, faలం కాదు. fa కారం మనకసలు లేదనుకుంటాను.
ఇకపోతే.., ఉచ్ఛారణ (ucCaaraNa) కాదట – ఉచ్చారణ (uccaaraNa) సరైనదట!
1. భ్రంహ
2.కత
3.ఫలమ్
రాజారావుగారూ,
మంచి సందేహాలే వెలిబుచ్చారు. మీకు తెలియక అడిగారని మాత్రం నమ్మలేం.
మీలాగే నాకూ అనుమానంగా ఉండేది..బ్రహ్మ,సుబ్రహ్మణ్యం వంటివి పలికినప్పుడు హ సైలెంటయిపోతుంది చాలా మంది మాటల్లో.ఎందువల్లనో అని.. మీరు చెప్పినట్టు కొండొకచో ప్రముఖుల విషయంలో కూడా.
మీరు చెప్పిన లిస్టులో చేర్చవలసిన ఇంకో మాట-చిహ్నం… చాలామంది ఈ పదంలోని అక్షరాలను స్పష్టంగా పలకరు.మధురగాయకుడు ఘంటసాలగారి గొంతులో కూడా ఈ పదం వచ్చినప్పుడల్లా నాకు చిన్హం అనే వినిపిస్తుంది (కోడెనాగు చిత్రంలో ఇదే చంద్రగిరి పాట వినండి)
ముందు ఉచ్చారణ లో చ కి వత్తు లేదు ఉచ్చారణ సరైన పదం.
చదువరిగారు చెప్పినట్టు మనకి తెలుగులో fa లేదు, phaలమే సరైనది.
హిందీలో faల్(ఫల్ ) తెలుగులో ఫలం phaలమే.
వీటితో పాటు వత్తు ఉందా లేదా ఎక్కడ ఉంటుంది అని అనుమానించే పదాలు
బాధ, బోధ, భేదము . వీటిలో వత్తు ఎక్కడ వస్తోందో గమనించాలి.
కష్టమయినా భాషకి నష్టం కలిగించకుండా ఉండాలంటే తెలుసుకొని ప్రయత్నం చేసి పలుకవలసిందే.
“హ”కు “మ”ఒత్తు కాని ,”న” ఒత్తు కాని ఇచ్చినప్పుడు, ముందు ఒత్తు పలికి తరువాతే “హ” పలకవలెను.
SP కూడా హృదయాన్ని – హ్రిదయం గా పలుకుతాడు. ఇంతకీ ఏది కరెక్టు.
సత్యనారాయణ గారు సరిగ్గా చెప్పారు..
“హ”కు “మ”ఒత్తు కాని ,”న” ఒత్తు కాని ఇచ్చినప్పుడు, ముందు ఒత్తు పలికి తరువాతే “హ” పలకవలెను
నాకు తెసిన కొన్ని వుదాహరణలు..
మధ్యాహ్నం పలికేటప్పుడు మధ్యాన్ హము
బ్రాహ్మణుడు …. బ్రామ్హణుడు
ఆహ్నికము…. ఆన్ హికము
జాహ్నవి…… జాన్ హవి
అపరాహ్ణము…. అపరాణ్ హము
చిహ్నము ….. చిన్ హము
మీ మూడు సందేహాలకు సమాధానాలు ఇవి-
౧)తెలుగులో ఏ పదమైనా ఎలా వ్రాస్తే అలాగే పలుకుతాం. అదే మన భాష గొప్పతనం కూడా. కాని “బ్రహ్మ” తెలుగు శబ్దం కాదు. అది సంస్కృత శబ్దం. సంస్కృత వ్యాకరణానుసారం “హ” కు ఏ ఒత్తు ఇచ్చినా, ఒత్తు అక్షరం ముందు పలుకాలి. అందుకే “బ్రమ్హ” అని పలుకుతాం.
౨)”కథ”ను “కధ” అని పలుకడం తప్పు.
౩)తెలుగులోగాని, సంస్కృతంలోగానీ, “FA”అన్న అక్షరం లేనే లేదు.అది అరబ్బీ, ఫార్సీ, ఆంగ్లం మొ||న భాషలలోనే ఉన్నది. “ఫలం” అన్న పదాన్ని “PHALAM”అని పలుకాలి గాని, “FALAM” అని పలుకగూడదు.
ఇక మరో మిత్రుని సందేహానికి సమాధానం_
“హృదయం”ను “హ్రుదయం” అని పలుకగూడదు. మరీ “హ్రిదయం” అని కాకపోయినా, దానికి దగ్గరిగానే పలుకాలి. “ఛందస్సు” తెలిసిన వారికి ఈ మర్మాలన్నీ బోధపడుతాయి.
– డా|| ఆచార్య ఫణీంద్ర
మంచి ప్రశ్నలే అడిగారు! నాకు తెలిసినంతలో అర్థమైనంతలో —
౧ హకారం నాదమహాప్రాణోష్మవర్ణం (గాలి ఎక్కువ తీసుకోవాలి పైగా ఊది కంఠంతో పలకాలి) కాబట్టి హ తో సంయుక్తమైన వర్ణాన్ని ముందు పలికినా దోషం ఉండదు. అంటే అహ్నము అని ఉంటే అన్హము అని ఉచ్చరించినా తప్పులేదు. కానీ అలా పలికేటప్పుడు మధ్య వ్యవధానం రాకూడదు అంటే అన్-హము అనడం తప్పు. వ్యవధానం రాకూడని చోట వ్యవధానం ఇచ్చి పలికినదానికి చాలా మంచి ఉదాహరణ… “అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నది” పాటలో (చిత్రం: ప్రేమించుకుందాం రా) “ప్రతీజన్మ నీ తోనే ముడేశాడు బ్రంహ” అని పలుకుతారు బాలు. అలా పలకడం తప్పు. కానీ అది పాట కాబట్టి మినహాయింపు. ఈ రకమైన ఉచ్చారణకి జిహ్వ, సహ్యము, పరంబ్రహ్మ, ఆహ్లాదము ఇత్యాదులు కూడా ఉదాహరణలే. దీనికి శిక్షలో ఏమైనా సూత్రముందేమో నాకు తెలియదు.
౨ కథ సరైనది. కధ అనేది గ్రామ్య ప్రయోగం కావచ్చు. అలాగే ఉచ్చారణ సరైనది. అపరాహ్నము సరైనది.
౩ ఫలం. “fa” తెలుగులో లేదు. ఇది ఉర్దూ పారశీక భాషలకి సంబంధించిన సంకర ప్రయోగం.
౪ ఋకారం మూర్ధస్థానం (జిహ్వోపాగ్రేణ) నుండి ఇకారం తాలుస్థానం (జిహ్వామధ్యేన) నుండి పలకాలి. వినడానికి హృదయం హ్రిదయం దగ్గరగా ఉంటాయి.
mee blog lo comments chadivi nenu kuda chala vishayalu telusukunnanu. thank u.
నాకూ కొన్ని సందేహాలున్నాయి. నిఘంటువుల్లో చూసినా వెంటనే మరచిపోతుంటాను.
భేదము – బేధము … వీటిలో ముఖ్యమైనది.
కథల గురించి ఒకసారి నా గోడు బ్లాగుతో చెప్పుకున్నాను
రాజారావు గారూ,
అర్జంటుగా మీ ఫోన్నెంబరుతో నాకు ఈ మెయిలు చెయ్యండి. చాలా ముఖ్యమైన విషయం.
kottapali at gmal dot com
మీ బ్లాగు చుసిన తరవాత నాకు కూడా ఒక పెద్ద ధర్మ సందేహమే గుర్తుకొచ్చింది….మనం చదివేటప్పుడు ‘అం’ (am) అంటాము. కానీ వాడుకలో ‘an’ అంటాము. ఎందుకలా?
ఉదాహరణకి “అందం” andam అని పలుకుతాము, not as ‘amdam’.
ఇక ‘అః’ ఉపయోగము ఐతే నేను మరిచిపోయాను కూడా! http://iamharish.wordpress.com/2009/01/20/telugu_uchharana/
ప, ఫ, బ, భ, మ లకి ముందు వచ్చే సున్న మకారం పలుకుతుంది. మిగిలిన హల్లుల ముందు వచ్చేది నకారం పలుకుతుంది
idi na prashana ku smadhanam….chalamandiki telise undochu. kani naku matram ippude telisindi :(.
paina chala mandi cheppinattu ‘fa’ anedi telugu lo leni shabdamu ani ardhamavutondi. kani ‘falguna masam’, ‘phanindrudu’ lantivi telugu lo ennalla nuncho antarlenamuga unna padalu kada? mari veti sangatenti….kalakramena phalguna masam kasta falguna masam la marinda? na chinnappudu konatamandi “pa, pha, ba, bha, ma” ante inkonta mandi “pa, fa, ba, bha, ma” ani anevaru ani gurtu.
సంస్కృత భాషలోని పదం తెలుగు భాషలో చాలా ఏళ్ళుగా వ్యవహారంలో ఉన్నంత మాత్రాన దాని ఉచ్చారణ మారదు. వ్యవహారంలో తప్పుగా పలుకుతున్న వారు దాన్ని సరిదిద్దుకోవాలి
rajarao garu
naaku telisi andaru ‘ bramma’ anestaaru.
mana telugu vaLLu chese ghora tappidam emitante ‘satyanarayana’ anadaaniki ‘sachyanarayana’ ani antaaru.
north indians ‘tya’ sprishtamgaa palukutaaru. manam maatram ‘chya’ antaam.