నిన్ననే “ఈనాడు” పేపర్లో ఈ వార్త చూసాను. వినాయక చవితి సందర్భంగా జరిగిన సంబరాలలో పాల్గొని విగ్రహారాధన చేసినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ ఫత్వా జారీ చేయబడింది. మొన్నటికి మొన్న సానియా మిర్జా దుస్తుల విషయంలోనూ ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేసాయి. ఈ విధంగా ముస్లిం సంస్థలు అతివాద, ఛాందస పోకడలు పోతుంటే, హిందువుల పరిస్థితి మరో విధంగా ఉంది. హిందువుల పవిత్ర దేవాలయాలలో కళ్యాణ మహోత్సవాలకూ, బ్రహ్మోత్సవాలకూ పట్టు వస్త్రాలు సమర్పించేవారు హిందువులు కాకపోయినా అడిగేవారు లేకుండా పోయారు. రామసేతు విషయంలో రేగిన దుమారం అందరికీ తెలిసిందే. దీనికి చారిత్రక ఆధారాలు లేకపోయినా, కనీసం సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతంగా పరిగణించి పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన వుంది. ఇలాంటి అద్భుతమే ఏ అమెరికాలోనో ఉంటే ఈ పాటికి ఏ సబ్‌మెరైన్లలోనో పర్యాటకులను తిప్పి చూపించి ప్రపంచ ప్రాచుర్యం కల్పించేవారు. ఇక ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోని నాలుగు మాడ వీధులలోనూ ప్రతిష్ఠించాలనుకొంటున్న స్థంభాల నమూనాను టివిలో చూసాను. అది చూడడానికి అచ్చు శిలువ ఆకారంలో ఉంది. పైన ఎన్ని లతలను, నగిషీలను చెక్కినా దాని సహజ ఆకారం ఎక్కడికి పోతుంది..? టిటిడి వారు మాత్రం ఈ స్థంభాలు విజయనగరం కాలం నాటి సంస్కృతిని ప్రతిబింబించేలా తయారు చేస్తున్నామనీ, దీనిని విమర్శించడం తగదనీ సమర్ధించుకొంటున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ మధ్య కాలంలో హిందువుల మనోభావాలను దెబ్బ తీసే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మొత్తం మీద, తమ మతాలను పరిరక్షించుకొనే విషయంలోముస్లిములది అతివృష్టి అయితే, హిందువుల పరిస్థితి అనావృష్టిగా తయారయింది.
మన హిందూ స్వాములు కూడ ఫత్వా జారీ చేసారు, రాముడు లేదు అని చెప్పిన వారి నాలుక, తల తెస్తె బంగారం ఇస్తామని.
@ VJ,
కావచ్చు. …కాని సల్మాన్ ఖాన్ మీద ఫత్వా జారీ చేయటం …పర మత సహనం లేకపోవటం వలన. ఇక కరుణానిధి మీద ఫత్వా జారీ అయినది…మత ధూషణకు….
బాగా చెప్పారు రాజు పైకం గారూ..,
నేనూ ఇదే వ్యాఖ్య రాద్దామనుకొన్నాను.
ఫత్వాలు ముఫ్తీలు,ఉలేమాలు ప్రకటిస్తారు.అవి మంచిగా ఉంటే అంగీకరిస్తారు కానీ అభివృధ్ధిని అడ్డుకునే ఫత్వాలను అమాయకంగా ఎంతోకాలం మోయలేరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో అభివృధ్ధివాదం,మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది.ఇస్లాంలో దర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్ లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు …లాంటివన్నీ నిషిద్ధమని ఫత్వాలు ఇచ్చినా వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో లక్షలాది ముస్లింలు పాతుకుపోయారు.భారతరత్నలు కూడా అయ్యారు.అన్నిరకాల జనాన్ని మతం కలుపుకుపోక తప్పదు.ప్రజల సుఖ శాంతుల కోసం మతంలో నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉండాలి.
నిరసనలు ఎదుర్కొన్నఫత్వాలు:1.వడ్డీ, జూదం ఆధారంగా రూపొందినందువల్ల బీమా పాలసీలు ఇస్లాంకు వ్యతిరేకం.ఫత్వాలు నన్ను ప్రభావితం చేయలేవు,నాకు కూడా బీమా పాలసీలున్నాయి అన్నారు కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్,2.బ్యాంకుల్లో పనిచేయడం ఇస్లాంకు వ్యతిరేకం,3.ముస్లిం మహిళలు న్యాయమూర్తి పదవి చేపట్టడం నిషిద్ధం.4.పెళ్ళికి ముందే వీధుల్లో షికార్లు చేసిన ఒక ప్రేమ జంట పెళ్ళికి వెళ్ళొద్దు.5.వందేమాతరం గీతంలోని కొన్ని పంక్తులు ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ పాటను ముస్లింలు పాడకూడదు.
కొన్నిమంచి ఫత్వాలు:1.కర్ఫ్యూ సమయంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి.2.ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం (హరామ్ )నిషిద్ధం.ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉంది. (జమీయతుల్ ఉలమాయె హింద్ దేవబంద్)