కృష్ణవంశీ చాలాకాలం తరువాత కుటుంబ, ప్రేమ కథా చిత్రం తీసాడని ఎగురుకుంటూ రిలీజయిన రోజునే వెళ్ళి చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సినిమా మొదటినుంచి చివరివరకు గోల గోల. హీరో నవదీప్, రెండో హీరోయిన్ (పేరు తెలీదు), సినిమా మొత్తం అరుఫులు, వెకిలి, కోతి చేష్టలతో చెత్త చెత్త చేసి పారేసి ఇరిటేషన్‌తో నేను జుట్టు పీక్కునేలా చేసారు. మొత్తం సినిమాలో ఆహుతి ప్రసాద్ చేసిన కొద్దిపాటి కామెడీ తప్పితే చెప్పుకోదగినదేమీ లేదు. “మురారి”, “నిన్నే పెళ్ళాడుతా” లాంటి సినిమాలు విజయవంతమవడానికి ముఖ్య కారణం హీరో, హీరోయిన్లు కూడా కామెడీ పండించడం. ఈ సినిమా కథ ప్రకారం దానికి అవకాశం లేకుండా పోయింది. ఇకపోతే, నవదీప్, రెండో హీరోయిన్ వేసిన వెర్రి వేషాలను కామెడీ అని భావించేంత సహృదయం నాకు లేదు.
ఇక ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశం వివరిస్తాను. హీరోయిన్ కాజల్, హీరో నవదీప్ ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక రాత్రి హీరోయిన్ తప్పతాగి హీరో ఇంట్లో నిద్ర పోతుంది. పొద్దున్న లేచి చూసేసరికి, వంటి మీద వేరే దుస్తులు ఉంటాయి. రాత్రి ఏం జరిగిందని అడిగితే, హీరో కొంటె నవ్వు నవ్వుతూ “ఏం జరిగిందో నీకు తెలియదా..?” అంటాడు. ఎక్కడో చూసినట్టుందికదూ..? “దిల్‌వాలే..”, “బావగారూ బాగున్నారా..” లాంటి సినిమాలనుండి అరగగొట్టి పారేసిన ఈ సీనే ఈ సినిమాలోని కీలక సన్నివేశం. దీన్ని బట్టి మిగిలిన కథ ఎంత గొప్పగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.
ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం సాగదీతగానే అనిపించింది. ప్రారంభంలో భారతదేశ గొప్పతనంపై వచ్చే సన్నివేశాలు, నాగబాబు కూతురు కాజల్ కి పెళ్ళికొడుకును వెతికే సన్నివేశాలు, నవదీఫ్ కాజల్‌ను పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోమని బతిమాలే సన్నివేశాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రేక్షకుడిని అసహనానికి గురిచేసే సన్నివేశాలు ఎన్నో..
ఇక ఈ సినిమా ముఖ్య విషయంలోనే లోపం ఉంది. హీరోయిన్ కాజల్, తండ్రికి జరిగిన విషయం చెప్పటం తప్ప వేరే దారి లేదని తెలిసినా చివరివరకూ సా..గదీసి, క్లయిమాక్స్ లో చెప్పడం చూసి “ఇదేదో ముందే చెప్పి తగలడుంటే మాకీ మూడు గంటల నరకం తప్పేదిగా..” అని సగటు ప్రేక్షకుడు బాధ పడితే తప్పేమీ లేదు.
రొటీన్ తెలుగు సినిమాలలోలాగానే పతాక సన్నివేశంలో ఎవరు ఎవర్ని పెళ్ళి చేసుకొంటారో ఒక పెద్ద సస్పెన్సు అయినట్టు బిల్డప్పు, ఉన్నట్టుండి ఆహుతి ప్రసాద్ చిన్న సైజు విలన్‌గా మారిపోవడం, నాగబాబు ప్రేక్షకులు అందరివైపుకీ తిరిగి, ఆడపిల్లల మనస్తత్వం తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదంటూ క్లాసు పీకడం.. అన్నీ మూస సినిమాను తలపించాయి. ఉన్నంతలో శివ బాలాజీ, కాజల్ నటన ఫరవాలేదనిపించేలా ఉంది.
ఇక సినిమా హిట్టా, ఫట్టా అన్న విషయానికి వస్తే, ఇంతకంటే చెత్త సినిమాలు ఎన్నో (ఉదాహరణకు “వసంతం”, “లక్ష్మీ”, “నేనున్నాను” వంటివి) కుటుంబ, మహిళా ప్రేక్షకుల ఆదరణ పొంది బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన ఘన చరిత్రను చూసాను కాబట్టి, ఈ విషయాన్ని కాలానికే వదిలేస్తున్నాను. కొసమెరపు ఏమిటంటే.. నాతో పాటూ సినిమాకు వచ్చిన నా భార్య “సినిమా బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు కదా..” అని అనటం..!!
You have saved me from a headache. Thank you.
2nd heroine name “sindhu menon”
Badrachalam movielo act chesindi.
కొసమెరుపు…)) అప్పుడు మరోసారి జుట్టు పీక్కోవాలనిపించుండాలే!
వచ్చే వారాతంలో ఇక్కడికి రాబోతోంది. ఈ రోజే అనుకుంటున్నాను దానికి దూరంగా ఉండాలని. మీ టపాతో నిర్ణయం ఖాయం చేసుకున్నాను. థాంక్యూ.
కొసమెరుపు అదరహో…
బావుందాండీ మీ రివ్యూ.
కాజల్ డబ్బింగ్ గురించి ప్రస్తావించడం మరిచారు మీరు. నాకైతే చాల చిరాకు వేసింది. అస్సలు నప్పలేదు.
కాని,ఏం చేస్తాం. ఇలాంటి సినిమాలే 100 ఆడుతున్నాయి ఈ రోజుల్లో. హైదరాబాదు లో తికెత్లు బ్లాకు లో కొనాల్సిన దుస్ఠితి.
“HappyDays” , బాగుంటుందని ఆశ
-Sravan
కాజల్ కి డబ్బింగ్ చెప్పింది చార్మి అంట
kajal bavundi cinemalo and paatalaite naku baaga nachaayi.especially 1st one and title song.cinema aite maatram sodi.