“యమదొంగ” Vs “యముడికి మొగుడు”..!!

యమదొంగ సినిమాపై “కొత్త పాళీ” గారు మరియు “జ్యోతి” గారు రాసిన టపాలు చదివాను. కాని వాటిలో అన్ని విషయాలను ప్రస్తావించలేదని అనిపించి ఈ టపా రాస్తున్నాను.

మొదటగా ఈ సినిమాకి “యమగోల” తో కన్నా “యముడికి మొగుడు” తో ఎక్కువ పోలికలు కనిపించాయి నాకు. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యాన్నీ, భేదాన్నీ ఇక్కడ వివరిస్తాను.

“యముడికి మొగుడు” లో హీరో పేదలకు సహాయపడే ఒక కిరాయి రౌడీ. “యమదొంగ” లో హీరో ఒక దొంగ. అందులో హీరో ని హతమార్చడానికి కొందరు పథకం వేస్తే, ఇందులోనూ అంతే. పోతే అందులో చిత్రగుప్తుడి పొరబాటు వల్ల హీరో నరకానికి కొనిరాబడితే, ఇక్కడ పగ తీర్చుకోవడానికి యముడి ఆజ్ఞ పైన కొనిరాబడతాడు. అక్కడ రెండవ చిరంజీవి అమాయకుడు. అతనికి 21 సంవత్సరాలు నిండాక ఆస్తిపై తమ హక్కును కోల్పోతామని గ్రహించి విష ప్రయోగంతో హత్య చేస్తారు అతని బంధువులు. ఈ సినిమాలో రెండవ చిరంజీవి పాత్రను ప్రియమణి పోషించింది. ఈమె ఆస్తిపైనా బంధువులు పెత్తనం చెలాయిస్తుంటారు. ఒక్కోసారి కొరడాతో కూడా చావగొడతారు. ఆస్తి తమకే దక్కాలన్న స్వార్థంతో హత్యాయత్నం కూడా చేస్తారు. పోతే హీరో ఈ హత్యాయత్నాన్ని తెలియకుండా అడ్డుకోవడం, వారిద్దరి మధ్య ప్రేమ, ఇవన్నీ పైపై మెరుగులు. చివర్లో ఆమె బంధువులతో ఇంటిపనులు చేయించడం, అంట్లు తోమించడం ఇలా ఎన్నో పోలికలు. ఆ సినిమాలో చివర్లో చిరంజీవికి మరణం సంభవించబోతుంది. కాని యముడి ఆశీస్సులతో “చిరంజీవి” అవుతాడు.  ఈ సినిమాలోనూ రెండవ “యమగండం” పేరు చెప్పి హీరోను రెండవ మారు చంపడానికి ప్రయత్నిస్తాడు యముడు. ఇవన్నిటితో చూస్తే జ్యోతి గారన్నట్లు ఈ సినిమా “కొత్త సీసాలో పాత మందే”..!!

పోతే “యముడి కి మొగుడు” లో యముడి పాత్ర ఎంతో హుందాగా చిత్రీకరించబడింది. చిత్రగుప్తుడు చేసిన పొరపాటును దిద్దడానికి ధర్మపరిరక్షకుడైన యముడు అనుక్షణం పరితపిస్తాడు. ఇకపోతే “యమదొంగ” సినిమాలో యముడి పాత్రకు ఈర్ష్య, ద్వేషాలను ఆపాదించి కుటిలుడుగా చిత్రీకరించారు. పోతే మోహన్‌బాబు ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. కుటిలత్వాన్ని బాగా ప్రదర్శించినా, అతని డైలాగ్ పవర్‌కి సరిపోయే మాటలు ఈ సినిమాలో లేవనే చెప్పాలి. ఇక చిత్రగుప్తుడి పాత్రను ఒక విటుడిలా చిత్రీకరించడం, భూలోకం నుంచి వచ్చిన వేశ్యతో కులకాలని చూడటం, అందుకు శిక్షలు మాఫీ చెయ్యడం లేదా తగ్గించడం, యమలోకాన్ని ఒక గవర్న్‌మెంట్ ఆఫీసుకన్నా హీనంగా, ఒక వ్యభిచార గృహం కంటే దారుణంగా చిత్రీకరించడం.. ఇవన్నీ హాస్యం ముసుగులో హిందూ దేవుళ్ళని కించపరచడమే. ఈ ఖర్మ హిందువులకేనేమో. వేరే ఏ మతం వారిపైనైనా ఇలాంటి దృశ్యాలను చిత్రీకరిస్తే ఈ పాటికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే లేచి ఉండేది.

ఏది ఏమైనా మిగిలిన యమలోక సన్నివేశాలు కూడా యమగోల, యముడికి మొగుడు చిత్రాలను తలపించాయే తప్ప కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. కేవలం డ్యాన్సు, ఫైట్లు, అసభ్యత, అశ్లీలత లను నమ్ముకుని ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా తీయడం డబ్బుతో జూదమాడటమే. స్టార్ కాస్టింగ్, గ్రాఫిక్స్‌లపై పెట్టిన శ్రద్ధ కథ, కథనం పై పెట్టి ఉంటే, N.T.R అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమా “సింహాద్రి” ని మించిన బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. ఈ విషయంలో మాత్రం రాజమౌళి N.T.R అభిమానులను నిరాశపరచినట్టే. 
 

6 comments on ““యమదొంగ” Vs “యముడికి మొగుడు”..!!

  1. సైకం రాజు అంటున్నారు:

    thanks for the unbiased review. నేను సినిమా చూడలేదు కాని, విన్న కధ ప్రకారం ‘యమ దొంగ ‘ కి , చిరంజీవి ‘యముడికి మొగుడు ‘ కి చాలా పోలికలు ఉన్నాయి.

    RajaMouli got a raw idea of story related to yama lokam – yamudu – , but he failed to implement the idea.

    Till now Yama Dhrama Raju is a great god, everyone piturised the character like that only.

    Only RajaMouli shaped Yama like that.

    and only we are not opposing it.

  2. నవీన్ గార్ల అంటున్నారు:

    తాడి తన్నేవాడుంటే ….వాడి తలను తన్నేవాడుంటాడంట. యమదొంగ ఏమి చూశారు, యమగోల మళ్ళీ మొదలైంది గురించి చదవండి: http://www.greatandhra.com/telugu/cinema/21-08-2007/yamado_23.php
    మీరు మళ్ళీ దీనిని తిడుదతూ ఇకో టపా వ్రాయటం ఖాయం 🙂

  3. విహారి అంటున్నారు:

    Most unfit character is narada (naresh)

  4. prasad అంటున్నారు:

    i also agree naresh as narada unfit.

  5. viswanath అంటున్నారు:

    WHERE IS THE BODY??

    In the previous movies of Yama theres little how drama about place the soul,,,here in this we didnt find any trace of it,,,because any deadbody will be destroyed na,,

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s