జెమిని “చిత్ర” హింస..!!

రోజూ జెమిని ఛానల్లో డబ్బింగ్ సినిమాలనూ, సా..గదీత సీరియళ్ళనూ చూసి చూసీ విసుగు పుట్టి, కనీసం స్వాతంత్ర్య దినోత్సవం నాడైనా మంచి కార్యక్రమాలు ఉండకపోతాయా అని ఎదురు చూసిన నాకు తీవ్ర నిరాశే ఎదురయింది. ఆ రోజు మొదటినుండీ చివరి వరకూ చలన చిత్రాలకు సంబంధించిన వేరు వేరు కార్యక్రమాలతో విచిత్ర రీతులలో “చిత్ర” హింసను కొనసాగించారు జెమిని వారు.

ఆగస్టు పదిహేను నాడే విడుదల అయిన “యమ దొంగ” చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు సింహభాగాన్ని ఆక్రమించాయి. “సక్సెస్ దొంగ” కార్యక్రమంలో రాజమౌళి తో, “యమ ఆలీ” కార్యక్రమంలో N.T.R మరియు ఆలీ తోనూ ముఖాముఖి, తాను తీయబొయే కొత్త సినిమాలో తెలుగు నాయికకై అన్వేషణ అన్న సాకు చెప్పి తన సినిమాలకు ప్రచారం కల్పించుకొంటున్న దిల్ రాజు కార్యక్రమం “కొత్త బంగారు లోకం”, ఇటీవలే జరిగిన తానా వార్షికోత్సవ కార్యక్రమాలు, త్వరలో విడుదల కానున్న “యమ గోల” సినిమాపై శ్రీకాంత్ తో ముఖాముఖి.. ఇవండీ మన జెమిని వారు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రసారం చేసిన “ప్రత్యేక” కార్యక్రమాలు..!!

వీటితో పాటుగా, నిర్లక్ష్యానికి మరణమే శిక్షగా ప్రబోధించే “అపరిచితుడు”, ఫ్యాక్షనిస్టుల ప్రతీకారాలతో నిండిపోయిన “యజ్ఞం”, భారత పాకిస్తాన్ మధ్య చిచ్చును సొమ్ము చేసుకొంటూ రూపొందించిన “ఖడ్గం”.. ఇవి ఆరోజు ప్రసారం అయిన చలన చిత్రాలు. ఆరోజు మొత్తం, స్వాతంత్ర్యానికి సంబంధించిన ఒక్క ప్రత్యేక కార్యక్రమం కూడా నాకు భూతద్దంతో వెతికినా కనిపించలేదు. అన్నట్లు మరచిపోయాను.. ఒక్క కార్యక్రమంలో మాత్రం “గాంధీ” గారు కనిపించారండోయ్..!! అదీ “శంకర్‌దాదా జిందాబాద్” చిత్ర ప్రచారానికై ఉద్దేశించిన కార్యక్రమంలో. ఇందులో కూడా సినిమా ప్రచారం చేసుకోవాలన్న కోరిక తప్ప, జనానికి గాంధీ గారిని మరోసారి గుర్తు చేద్దామన్న తపన కనపడలేదు. 

ఈ శాటిలైట్ ఛానళ్ళ వారు ప్రసారం చేయాలనుకొంటే మంచి కార్యక్రమాలెన్నో చేయవచ్చు. స్వాతంత్ర్య సమరయోధులతో ముఖాముఖి, ఆ సంగ్రామంలో వారి అనుభవాలు, ప్రస్తుతం పింఛన్లకై వారు ఎదుర్కొంటున్న కస్టాలు, మన స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, సిపాయిల తిరుగుబాటు, జలియన్‌వాలాబాగ్ దురంతం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణోద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సంగ్రామంలో గాంధీతో పాటుగా పోరాడిన భగత్ సింగ్, అల్లూరి, నేతాజీ వంటి విప్లవ వీరులు, లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్, ప్రకాశం పంతులు వంటి నాయకులు, ఇలా తలచుకొంటే ఎన్నో సంఘటనలపై లేదా ఎందరో వ్యక్తులపై “ప్రత్యేక” కార్యక్రమాలను ప్రసారం చేయవచ్చు. కాని అడ్వర్టైజ్‌మెంట్లతో వచ్చిపడే డబ్బుకు ఆశ పడి రోజంతా సీరియళ్ళతోనూ, సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలతోనూ నింపేస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రానంతవరకూ మనకీ “చిత్ర”హింస తప్పదు.   

5 comments on “జెమిని “చిత్ర” హింస..!!

 1. నాగరాజా అంటున్నారు:

  హహ్హహ్హా… మీ చిత్రహింస ప్రయోగానికి అంత నవ్వు వచ్చింది…

 2. ప్రసాద్ అంటున్నారు:

  మీ భాధే నా భాధ. చక్కగా చెప్పారు.
  నేనయితే అసలు ఈ చానల్ చూడటమే మానేశాను. అయినా ఏదయినా అంతేగా! ఇంతకు ముందటి దూరదర్షనే మేలేమొ!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. kartheek అంటున్నారు:

  మీరు చెప్పింది అక్షర సత్యం.ఇంకొన్ని సంవత్సరముల తరువత గాంధి అంటే ఎవరు అని అడిగినా ఆఛ్చర్యపొనక్కరలేదు. ఇది గాంధి గారు చూస్తే నిజంగా అత్మహత్య చెసుకుంటారు. ఇదీ మన దేశ ప్రగతి అంతరిక్షాన్ని అధిరొహించాం గాని అంతటి స్వేచ్చకు కరనమైనవాళ్ళను మరచిపొయాం సెలవొస్తే సుబ్బరం గుర్రు పెట్టి పడుకోవదం టీ వీ లో వచ్చే చెత్త చూడడం తినదం పడుకొవడం. దానికి కారనమైన వాళ్ళను ఒక్క సారి కూడ తలచు కోవడం లేదు. ఇది మన దేశ మరియు దేశ ప్రజల దౌర్భగ్యం దీనికి నేను చింతిస్తున్నను ఎందుకంతె నెను కూడ ఈ దౌర్భగ్యపు ప్రజలలొ ఒక్కడిని కాబట్టి. నా మటలు ఎవరినైనా నొప్పించినచొ మన్నించెదరు.

 4. kartheek అంటున్నారు:

  క్షమించండి గాంధి అని వ్రాసినందుకు గాంధీ చూసారా పోనుపోను గాంధీ ఎవరని అదుగుతలొ తప్పు లేదు ఇది మన పరిస్థితి.

 5. […] TV ని వ?తికారేస?త?న?నర?, మీరూ కొంచెం సాయం చెయ?యండి. ఆగస?ట? పదిహేన? నాడే విడ?దల […]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s