బాబోయ్ భారత్ బజార్..!!

ఈ మధ్య అమెరికాలో సందు సందునా, గొందు గొందునా భారత్ బజార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలావరకూ, వినియోగదారులను దోచుకొందుకు, అందినకాడికి లాభాలను దండుకొందుకు ప్రాధాన్యతనిస్తూ, నాణ్యమైన వస్తువులను అందివ్వాలన్న కనీస బాధ్యతను విస్మరిస్తున్నాయి.

ఇటీవల నేనొక భారత సూపర్ మార్కెట్ కి కాఫీ పౌడర్ కొనడానికి వెళ్ళినప్పుడు, నవ్వుతూ ఉన్న సుహాసిని బొమ్మతో బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ ప్యాకెట్ కనిపించింది. తీరా తీసిచూస్తే అది 2005 లో తయారయిన కాఫీ పౌడర్. దానిపై Best Before 9 months from mfd date అని రాసి ఉంది. అంటే అది expire అయ్యి సంవత్సరం పైగా అయ్యిందన్నమాట. అప్పటినుంచీ నేను కొనే ప్రతి వస్తువుకూ expiry date చూడటం అలవాటు చేసుకొన్నాను. నేను గమనించిన విషయం ఏమిటంటే, ఈ సమస్య ఏ ఒక్క కాఫీ పౌడర్ కో మాత్రమే  సంబంధించిన విషయం కాదు. ఈ భారతీయ మార్కెట్లలో దొరికే చాలా వస్తువులు expire అయిపోయినవో, లేక ఒకటి లేదా రెండు నెలల్లో expire అవబోయేవో.. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని వస్తువుల మీద expiry dates కూడా ముద్రించి లేకపోవడం. పచ్చళ్ళు, మ్యాగీ, ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. ఆ మద్య Parle-G బిస్కట్ ప్యాకెట్లు డాలర్ కి పది అని కొనబోతే, వాటిలో చాలావరకు expire అయిపోయినవే. దీనిని బట్టి నాకు అర్ధం అయిన విషయం ఏమిటంటే, expire అయిన లేదా అవబోతున్న వస్తువులని ఇలా వదల్చుకొంటున్నారని.

వీటితో పాటుగా ప్రస్తావించుకోవలసినవి పాలు, పెరుగు, బ్రెడ్ వంటివి. ముఖ్యంగా బ్రెడ్ ఎంతో కాలం నిలువ ఉండదు. పట్టుమని పదిరోజులు కూడా నిలువ ఉండని ఈ బ్రెడ్ ను రోజుల తరబడి అమ్మడం నాకు తెలుసు. పోనీ కాయగూరలన్నా తాజాగా ఉంటాయా అంటే అదీ లేదు. ఎప్పుడో వారాంతంలో జనం తాకిడి ఎక్కువ ఉండంటంచే తాజాగా ఉంచుతారే తప్ప, వారం మధ్యలో వెడితే అన్నీ కుళ్ళిపోయిన కూరగాయలే..!! అదీకాక తాజా కూరగాయలని కుళ్ళినవాటితో కలిపి లాభాలు దండుకోవటానికి ప్రయత్నిస్తారు.

కూరగాయలు, పాలు, పెరుగు వంటివి తాజాగా ఉండాలంటే కావలసినది మంచి cooling system. ఇది చాలా స్టోర్లలో లేదు. ఉన్నా సరిగా పని చేయదు. ఇటువంటి చోట్ల కొన్న పాలు, పెరుగు వంటివి expiry date వరకు పాడవకుండా ఉంటాయన్న గ్యారంటీ ఏముంది..? ఇలాంటి చోట్ల పాలు కొన్న ఎంతోమంది స్నేహితులకి అవి కాచగానే విరిగిపోవడం నాకు తెలుసు. అదే విధంగా పప్పుదినుసులు మొదలైనవి పురుగులు పట్టడమో, పాడైపోవడమో జరిగిన సందర్భాలు అనేకం. అమెరికన్ స్టోర్లలో దొరికే ప్రతి వస్తువునూ నాణ్యతతో ఉండాలని కోరుకొనే మనం, ఒకవేళ ఏ మాత్రం నాణ్యత లోపించినా ఆరునెలలైనా నిర్మొహమాటంగా తిరిగి వెనుకకు ఇచ్చి డబ్బును డిమాండ్ చేసే మనం, ఈ ఇండియన్ మార్కెట్లలో జరిగే ఆగడాలను నిలదీయడానికి మాత్రం వెనుకాడతాము, జంకుతాము.. ఎందుకు..? ఇందుకు నేను కూడా మినహాయింపు కాదు.

ఇకపోతే ఈ ఇండియన్ స్టోర్లు జనాలను దోచుకొనే విధాలు అనేకం. వీరు విక్రయించే వస్తువులలో చాలావరకు వస్తువులు ఇండియా నుంచి దిగుమతి చేసుకొన్నవే. వీటిపై ఇండియా లోని వెల తప్ప, అమెరికా వెల ఉండదు. ఇక్కడి స్టోర్ల వాళ్ళు ఏది ముద్రిస్తే అది దాని వెల అయి కూర్చుంటుంది. ఇక పండుగలోస్తే వీరికి “పండుగే”..!! రాఖీ, వినాయక చవితి, ఉగాది లాంటి పండుగలకి ఇండియా నుంచి రాఖీలు, వినాయకుని బొమ్మలు, పాలవెల్లులు, వేపపువ్వు, మామిడాకులు వంటివి తెచ్చి ఆకాశాన్నంటే ధరలను నిర్ణయించి అమ్ముతారు. ఇక శ్రావణ శుక్రవారాలొచ్చాయంటే తమలపాకులు, కొబ్బరి కాయలను కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి.

ఈ మార్కెట్లలో పోనీ customer service అన్నా బాగుంటుందా అంటే అదీ లేదు. ఏ వారాంతాంలో వెళ్ళినా ఆ మూల నించీ ఈ మూల వరకూ వరుసలో జనం. కూరగాయలు బిల్ చేసే విధానం మరీ దారుణం. కూరగాయలను వెయింగ్ మెషీన్ మీదనుంచి లాగి ఏదో మీటలు నొక్కి ఎంతో ఒకంత వెల టైప్ చేస్తారు. పోనీ బిల్ లో వెల సరిచూసుకొందామంటే ఆ బిల్ ను డీకోడ్ చేయటానికి ఏ software enginner సరిపోడు.

ఇక ఇండియాలో ఒక వస్తువుకు మరో వస్తువును ఉచితంగా ఇవ్వడం సహజం. ఉదాహరణకు కాఫీ పౌడర్ కు గ్లాసో, స్పూనో ఇవ్వటంలాంటివి. ఈ ఇండియన్ స్టోర్లలో మరీ దారుణంగా అలా ఉచితంగా వచ్చిన ఆ గ్లాసునీ, స్పూనునీ కూడా వెల నిర్ణయించి అమ్మడం నేను చూసాను.

ఇక వినియోగదారుడిని ఆకర్షించడానికి వీరు అనుసరించే మార్గాలు ఎన్నో.. $20 కొంటే 2% డిస్కౌంట్, $30 కొంటే 3% డిస్కౌంట్ అంటూ.. ఇవికాక ఉచిత DVDలనీ, పాయింట్లనీ ఇలా ఎన్నో.. ఈ కొసర్లకు ఆశ పడి, కుళ్ళిన కాయగూరలను, అవసరం ఉన్నా లేకున్నా అందిన వస్తువులను, cart లో వేసి బిల్ చేసే వాళ్ళను అనేకం చూసాను. DVD, వీడియో క్యాసట్ల విషయానికొస్తే ఈ స్టోర్లన్నీ పైరసీకు నిలయాలుగా మారిపోయాయి. మన కళ్ళెదురుగానే DVD నుంచీ క్యాసెట్ కు కాపీ చేసేస్తుంటారు.

కానీ, మన బలహీనతలతో ఆడుకొనే ఇలాంటి స్టోర్లను ప్రోత్సహించకూడదు. మనకు వారేదో ఉపకారం చేస్తున్నారన్న భ్రమనుండి బయటపడి, మనం లేనిదే వారు మనలేరన్న వాస్తవాన్ని గ్రహించాలి. మన సేవలకు ఏ విధమైన లోపం కలిగినా వెంటనే నిలదీయాలి. తాజా కాయగూరలకై రైతు బజార్లు (farmers market)లాంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. మన లేదా మన కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పోలిస్తే ఆదా చేసే కొన్ని డాలర్లు లెక్కలోనివి కావన్న సత్యాన్ని గ్రహించాలి. అమెరికాలోని ప్రతి భారతీయుడూ కలసి రాకుంటే ఈ దోపిడీ బజార్లు మరింత పేట్రేగిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ముఖ్య గమనిక: ఈ టపాలో “భారత్ బజార్” అన్న పదం అన్ని భారతీయ సూపర్ మార్కెట్లనూ ఉద్దేశించి రాసినదే తప్ప, “భారత్ బజార్” అనబడే చెయిన్ మార్కెట్ ను మాత్రమే ఉద్దేశించి రాసినది కాదు.

9 comments on “బాబోయ్ భారత్ బజార్..!!

 1. Thyaga అంటున్నారు:

  Welcome to Indain way of business in america.After all they are indians right?

 2. మీరు రాసింది చదివాకా గుండెలు ఒక్కసారిగా ఝళ్లుమన్నాయి. ఇన్నాళ్లు ఇక్కడి అమెరికా మార్కెట్లో మంచి నాణ్యత గల వస్తువులు అమ్ముతారని అనుకునేవాడిని. ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఎక్స్పైరీ తేది చూడకుండా గుడ్డిగా కొనేవాడిని. ఇకనుంచి కొనే ప్రతి వస్తువుని అమూలాగ్రం పరిశీలించి మరీ కొంటాను. చాలా ఉపయోగకరమైన విషయాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

 3. వికటకవి అంటున్నారు:

  మీరన్నవన్నీ నిజమే. అదేమిటో విదేశీ కొట్లు అనగానే ఇక్కడి ప్రభుత్వాలూ పెద్దగా పట్టించుకోనట్లే ఉంటారు. తప్పు బహుశా మనదేనేమో! పోనీలే అని మనం చాలా సరిపెట్టుకుంటాం. అదే పెద్ద తప్పు. ఉదా: కొన్న కొబ్బరికాయల్లో ఎప్పుడూ 50% కుళ్ళువే ఉంటాయి. అందుకే అవసరమయిన వాటికంటే రెట్టింపు కొంటాను.

 4. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  చాలా విచారకరం…
  మన వారే కదా అని ఆలోచించకుండా ఇలాంటి ఆగడాలను ప్రశ్నించాలి.

 5. T. Bala Subrahmanyam అంటున్నారు:

  “ఇండియా…ఇండియా..”అంటూ అందరినీ ఒక గాటన కట్టడం ఆ రకంగా తిట్టడం చాలా కష్టం. ఈ దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. రాష్ట్ర రాష్ట్రానికీ ప్రాంత ప్రాంతానికీ మనస్తత్వాల్లో తేడాలున్నాయి. అసలు ఆ కిరాణా కొట్లు నడిపేది ఏ రాష్ట్రం వాళ్ళో ముందు గమనిందండి. నాకు తెలిసి, ఉత్తరాది వ్యాపారస్తులకు నిష్ఠలూ నియమాలూ ఏమీ లేవు.

 6. radhika అంటున్నారు:

  అదేమిటండీ అలా అంటారు.ఇండియా సరుకులకు ఎక్ష్పైరీ డేట్ వుండదని మీకు తెలీదా?ఇక్కడ సరుకులు కొనేప్పుడు అలాంటివి పట్టించుకోకూడదు.గట్టిగా అడిగితే కొనకపోతే మానేయి అంటారు.పురుగులు పట్తడాలు చాలా సహజం.ఎందుకంటే అవి పేకెట్ల లో వుండగానే పురుగులతో వుంటాయి.మీకు నాణ్యమైన ఇండియా సరుకులు కావాలంటే కొన్ని ఇంటర్నేషనల్ సూపర్మార్కెట్లు వుంటాయి.అక్కడికి వెళ్ళండి.అక్కడ డేట్ అయిపోయినవి అమ్మరు.నిజం చెప్పాలంటే మన ఇండియన్ స్టోర్ లో కన్నా కొద్దిగా తక్కువ రేట్ కే దొరుకుతాయి.ఎప్పుడూ ఒకే రేట్ వుంటాయి.ఒక్కోసారి సేల్ లో కూడా దొరుకుతాయి.[డేట్ అయిపోయినవి మాత్రం కాదు].మాకు చుట్టుపక్కల ఎక్కడా ఇండియన్ స్టోర్ లు లేవు.35 నిమిషాలు ప్రయాణం చేస్తే వుంటుంది.అక్కడా అదొక్కటే దిక్కు.అందుకు రేట్లు పేలుతూ వుంటాయి.మరి పెద్ద ఊర్లలో,ఎక్కువ స్టోర్లున్న వూర్ల లో రేట్ల గురించి నాకు తెలీదు.కాంపిటిషన్ వల్ల ఏమన్నా తక్కువ రేట్లు వుంటాయేమో.మాకు ఇక్కడ వుడ్ మేన్స్ అని వుంది.అక్కడ నుండి తెచ్చుకుంటున్నాము.

 7. రాజారావు తాడిమేటి అంటున్నారు:

  బాల సుబ్రహ్మణ్యం గారూ,
  నేను పైన విశ్లేషించిన చాలా సూపర్ మార్కెట్ల యజమానులు మన తెలుగు వారే. మనిషి స్వార్ధానికి, లాభాపేక్షకి, అత్యాశకి సరిహద్దులు ఉంటాయా..? దక్షిణ భారతీయులంతా నిజాయితీపరులనీ, ఉత్తరాది వారంతా స్వార్ధపరులనీ ఒకే గాటన కట్టడం కూడా సరికాదేమో మీరు కూడా ఆలోచించి చూడండి.

 8. Madhavarao Tallapaneni అంటున్నారు:

  kakoorthi baboo——–kakoorthi , akkada koodaa mana paruvu chaala baaga nilabedatunnaru valluuuuuuuuu———vallaki danda vesi dandam pettaali, leda afganistano ledaa iraak lonoo vaari vidichi akkada pettamanaali stores.

 9. రవి వైజాసత్య అంటున్నారు:

  మావూళ్ళో ఒక తెలుగాయన శివార్లలలో ఇలాంటి అంగడొకటి పెట్టాడు..అందరు వ్యాపారస్తులు చికాగోనుండి సరుకులు తెప్పించుకొని అమ్ముకుంటుంటే కాస్త తెలివి ఉపయోగించి ఊర్లోని పెద్ద అంగడినుండి సరుకులు తెచ్చి వాటిపైన ధరల లేఋల్స్ ను చింపి రెట్టింపు ధరలు అతికించి అమ్మేవాడు. అఫ్‌కోర్సు ఆర్నెల్లు తిరిగేసరి కొట్టు మూసేయటం తర్వాత సంగతి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s