“మెయిల్” తో నా తిప్పలు

నేను U.S వచ్చిన కొత్తలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొన్నపుడు ఇంటి తాళాలతో పాటుగా తళతళలాడే ఒక ఇత్తడి తాళంచెవి ని కూడా ఇచ్చారు leasing offce వారు. అది mailbox తాళంచెవి అని, నాకు వచ్చిన టపా అంతా postman ఒక box లో పెట్టి వెళ్ళిపోతాడని, మనం వీలున్న టైంలో వెళ్ళి తెచ్చుకోవచ్చని చెప్పారు. అప్పటికే U.S లో సంవత్సరాలుగా ఉంటూ, లీజు సైన్ చెయించడానికి సహాయంగా వచ్చిన నా స్నేహితులు, “ఇది కూడా తెలియదా అమయకుడా..!!” అన్నట్లు జాలిచూపు విసిరి, U.S లో చాలా confidential documents మెయిల్లో వస్తాయని, అందుకే ఎవరి మెయిల్ వారే తీసుకొనేందుకు వీలుగా ప్రతి అపార్ట్మెంటుకు ఒక mailbox ఉండి, దాని తాళంచెవి ఆ అపార్ట్మెంట్ లో నివసించే వారికి మాత్రమే ఇస్తారని గీతోపదేశం చేసారు.

ఇదంతా నాకు కొత్తగా అనిపించింది. అప్పటివరకు మా ఊళ్ళో postman ఉత్తరాలు చేతికి ఇవ్వడం, కొండొకచో దూరం నించే విసిరి వెళ్ళిపోవడమే తెలుసు. Bangalore లో నేను పనిచేసే రోజుల్లో నేను ఆఫీసు నుంచి వచ్చే టైంకి నా ఇంటి ఓనరే నా టపా చేతపుచ్చుకొని postman లా ఎదురు చూసేవాడు. ఇక నేను చదివిన R.E.C Nagapur లో అయితే postman మా హాస్టల్ వరకూ రావడానికి బద్ధకం వేసి, దారిలో ఎవరో ఒకరి చేతికి హాస్టల్ టపా మొత్తం ఇచ్చేసేవాడు. ఇవ్వన్నీ చూసిన నాకు, అంతా విచిత్రంగా, నా mailbox తాళంచెవిని చూస్తే ముద్దుగా, ముచ్చటగా, అపురూపంగా అనిపించింది.

కొత్తలో mailbox తెరవాలనే సరదాలో, రోజూ పొద్దున్నా, సాయంత్రం, ఒక్కోసారి మెయిల్ రాదని తెలిసినా రాత్రి, నాకు మెయిల్ ఏమైనా వచ్చిందా అని గోతికాడ నక్క లాగా కాచుకు కూర్చునే వాడిని. నేను తెరుస్తానంటే నేనంటూ, నేను, నా భార్య పోటీ పడిన సందర్భాలూ ఉన్నాయి. ఎప్పుడో వచ్చే ఇండియా ఉత్తరాలూ, నెలకోసారి వచ్చే bills తప్పితే చాలామార్లు mailbox బోసిగా వెక్కిరించేది. Mailbox నుండి చేతినిండా మెయిల్స్ తో వెళ్ళేవారిని చూస్తే ఒకింత ఈర్ష్య కూడా కలిగేది.

రాను రాను నా mailbox కూడా నిండటం మొదలు పెట్టింది. మొదటిసారి pizza hut కూపన్లు వచ్చినపుడు ఎగిరి గంతేసి ఏదో సాధించినట్లు కాలర్ ఎగరేసాను. ఇక ఆ తరువాత నుంచి కుప్పలు తెప్పలు గా వేరే వేరే స్టోరుల నుంచి కూపన్లు వచ్చి పదటం, వాటిని వాడుకోవాలనే తాపత్రయం లో క్రెడిట్ కార్డు బిల్లు పేలడం మొదలయ్యింది. అప్పటినించీ కొత్త రకం కష్టాలు వచ్చిపడ్డాయి. ముక్కు మొహం తెలియని క్రెడిట్ కార్డు కంపెనీలన్నీ ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి చేయటం, ఇది చాలదా అన్నట్లు నేను కార్డు వాడిన ప్రతి అడ్డమైన స్టోరు వాడూ, నెలకో, వారానికో ఒక discount booklet పంపడం. “ఈ సేల్ ఈ వారం మాత్రమే..”, “ఇది కొంటే ఇది అప్పనంగా కొట్టేయచ్చు..” అంటూ..!! ఇది కాక, ఏదో share market లో పొడిచేద్దామని, కొత్త account ఓపెన్ చెస్తే free గా ipod, PDA వస్తుందని కక్కుర్తి పడి account open చేసిన ప్రతి స్టాకు బ్రోకరూ investment information అంటూ ఊదరగొట్టటం..   వీటికి తోడు customer satisfaction survey అనీ, research survey అనీ.. రకరకాలు..

ఇన్ని రకాల junk మెయిల్స్ మధ్యన నాకొచ్చే ఒకటి రెండు ముఖ్యమయిన letters, bills కూడా గుర్తు పట్టడంఈ మధ్యన కష్టం అయిపోతోంది. ఈ మెయిల్ని sort చేయలేక, తీసుకొచ్చి కుప్పలా ఇంట్లొ పడేయటం, ఇల్లాలితో చీవాట్లు తినటం పరిపాటి అయిపోయింది. గోరుచుట్టుపై రోకలి పోటా అన్నట్టు ఈ మధ్య కొన్ని bills టైంకి చెల్లించక పోవడం, late fees వాయగొట్టించుకోవడం కూడా జరిగింది. అలాగని పోనీ చెత్త మెయిలంతా trash చేద్దమంటే ఇంటి address నుంచి అంతా confidential అయిపోయే..

ఈ చెత్త మెయిల్ shred చేయటానికి ఈ మధ్య ఒక shredding machine కూడా కొన్నాను. అందులోనూ వెరైటీలు.. అడ్డంగానూ, నిలూవుగాను shred చేసేవి కొన్నయితే, కోలగానూ, జిగ్ జాగ్ గా shred చేసేవి కొన్ని. 5-6 కాగితాలు shred చేసేదొకటైతే, 10-15 కాగితాలు shred చేసేదింకొకటి. వెర్రి వెయ్యి విధాలు అన్నట్టు.. ఇది మాత్రమే కాక, మెయిల్ నీటుగా చింపటానికి ఒక కత్తి, వచ్చిన మెయిల్ని counter top మీద కాక ఒక చోట గుర్తు గా పెట్టుకోవడానికి letter box, ముఖ్యమైన documents భద్ర పరచుకోవడానికి ఒక file rack.. అబ్బో..!! చాలా వదుల్చుకొన్నాను ఈ మెయిల్ గురించి.. ఇది కాక, వారానికో, రెండు వారాలకో ఇంట్లో చెత్తని భరించలేక, ఎంతో విలువైన weekend లో ఒక గంట వెచ్చించి మెయిల్ క్లియరెన్స్ మహోద్యమం.. ఏమిచెప్పమంటారండీ మెయిల్ తో నా తిప్పలు..

11 comments on ““మెయిల్” తో నా తిప్పలు

  1. వెంకట రమణ అంటున్నారు:

    హహహహ.. మీ మెయిలు తిప్పలు భలే నవ్వు తెప్పించాయి.:).

  2. విహారి అంటున్నారు:

    అమెరికానా మజాకానా.

    ఓ సారి ఇల్లు కొనండి అప్పుడు పొస్టు బాక్సు నుండి మేయిల్ తెచ్చి సార్టు చేసుకోవడానికి ఒక మనిషి అవసరమవుతారు.

    — విహారి
    http://blog.vihaari.net

  3. నిజమండి బాబూ, రోజూ కుప్పలు తెప్పలుగా వచ్చే జంక్ మెయిల్స్ నుండి మనకు అవసరమైన మెయిల్ని వెతుక్కొవడం చాలా చిరాకెత్తించే పని.

  4. madhavi అంటున్నారు:

    నా గురించె చదువుతున్నట్టు ఉంది.నేను కూడా రొజు మైల్స్ చెక్ చేసుకునేదాన్ని.ఇప్పుడు మానేసాను.

  5. రాజారావు తాడిమేటి అంటున్నారు:

    వెంకట రమణ గారూ, విహారి గారూ, శ్రినివాస్ గారూ, మరియు మాధవి గారూ.. మీ అమూల్యమైన అభిప్రాయములకు ధన్యవాదములు.

  6. Srinivas అంటున్నారు:

    మీరు సరిగ్గా ఇక్కడ ఉన్నవాళ్ల అనుభవాలు రాసారు.హాట్సాఫ్

  7. lakshmi అంటున్నారు:

    me mail tippalu chadivi chala navvukunnanu.

  8. vijay అంటున్నారు:

    vijay
    narsampet
    warangal

  9. vijay అంటున్నారు:

    ABBANAPURAM VIJAY
    S/O:-MURAHARI
    H.NO:-3-236/1
    VALLBH NAGAR
    NARSAMPET 506132
    DIST:-WARANGAL
    ANDRAPRADESH
    INDIA
    CELL:-9030893451

  10. aarya2 అంటున్నారు:

    http://www.abbanapuram.hpage.com
    9030893451
    rammojifilimcity
    hydrebad 9030893451

  11. nagabhushanam అంటున్నారు:

    abba,enta hayee,idi chadivaka america lo lekunda india lo unnaduku ento santoshanga undi. aa badalu maaku rakunda undalani korukuntunnanu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s