నమస్కారం. తాడిమేటి రాజారావు బ్లాగ్ కు స్వాగతం. నేను Software Engineer నే అయినా ఎప్పుడూ నాకంటూ ఒక website ఉండాలని అనుకోలేదు. ఆ అవసరం ఇంతవరకు కనపడలేదు. ఈ మధ్యనే నా భార్య తెలుగు లో బ్లాగులు చూడటం, నాకు తెలియపరచటం జరిగింది. అవి చూసాక నాకు కూడా తెలుగు లో బ్లాగ్ తయారుచేయాలన్న కోరిక పుట్టింది. నాకు అరంభశూరత్వం ఎక్కువ కనుక మొదలు పెట్టటం అయితే చేసేసాను కాని, ఎంతవరకు తరచుగా update చేస్తానో కాలమే నిర్ణయించాలి.
నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. సొంత భాష లో అభిప్రాయాలను వ్యక్తపరచటం సులభం. “లేఖిని” వంటి software సహాయం తో తెలుగు లో బ్లాగ్ తయారుచేయటం నల్లేరు పై నడక అయిపోయింది. ఆందుకు వారికి ఎంతయినా ఋణపడి వుంటాను.
ఈ బ్లాగ్ లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు పొందుపరచటానికి ప్రయత్నిస్తాను. తరచు విచ్చేసి మీ అభిప్రాయాలను నాకు తెలియపరచండి.
బ్లాగులోకానికి స్వాగతం.
మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది.
జల్లెడ
http://www.jalleda.com
బ్లాగ్లొకానికి సుస్వాగతం
తెలుగు బ్లాగు గుంపు చాలా వెరైటీగా మంచి మంచి వ్యాసాలతో ఉన్నాయి. కాబట్టి వస్తూ,రాస్తూ ఉండండి.
ఒక్కసారి కనుక ఈ బ్లాగ్లకు అడిక్ట్ అయ్యారంటే ఇంక లాక్కోలేక, పీక్కోలేక చావాలి. రోజు కూడలి, తేనెగూడూ చూడకుండా ఉండలేము.
జాలయ్య గారూ, విహారి గారూ, వికటకవి గారూ, మరియూ శ్రీనివాస్ గారూ, మీరు నా బ్లాగు కు విచ్చేసినందుకు ధన్యవాదములు.