నా పేరు, కథా కమామీషూ..

నా పూర్తి పేరు తాడిమేటి రామ శ్రీనివాస లక్ష్మీనారాయణ శివనాగ రాజారావు. కొల్లేటి చాంతాడంత ఈ పేరు పురుకోస గా మారిపోవడానికి కారణాలు తెలుసుకోవాలంటే నా అక్క పేరుతో మొదలుపెట్టాలి.

నా అక్క పేరు తాడిమేటి వెంకట సత్య నాగ దుర్గ త్రినాథ రామ లక్ష్మీ గాయత్రి. నా అక్క పేరు హాజరు పట్టీ లోను, certificates లోను ఇదే విధంగా నమోదు చేసి మా నాన్నగారికి చుక్కలు కనిపించాయి. ప్రతి certificate లోను, ప్రతి hall ticket లోను ఎప్పుడూ తన పేరు లో అచ్చు తప్పులు దొర్లటం, సరిచేయటానికి వెనక్కి పంపించటం పరిపాటి అయిపొవటంతో ఆ తప్పు మళ్ళీ చేయకూడదని నిశ్చయించుకొని, నా పేరును తాడిమేటి రాజారావు గా కుదించేసారు.

ఇక నా పేరు లో ప్రతి పదం వెనుకా ఒక చరిత్రే ఉంది. తాడిమేటి మా ఇంటి పేరు. నేను “పునర్వసు” నక్షత్రం లో పుట్టటం, అది రాములవారి నక్షత్రం కావటం చేత “రామ” అనే పదం జతపరచారు. ఆందుకే నన్ను మా ఇంటిలో అందరూ “రాము” అని పిలుస్తారు. ఇక మా కులదైవం తిరుమలేశుడైన శ్రీ శ్రీనివాసుడు పేరు నా పేరు లో మరో పదం. నా ఇద్దరు తాతగార్ల పేర్లలో ఎవరి పేరు పెడితే ఎవరికి కోపం వస్తుందోననో ఏమో “లక్ష్మీ నారాయణ” అని మా అమ్మ వాళ్ళ నాన్నగారి పేరు, “రాజారావు” అని మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు తగిలించేసారు. ఇక శివుడు మా నాన్నగారికి ఇష్టమైన దేవుడు, “నాగ” అనే పదం పేరులో చేర్చటం మా ఆచారం. ఇదండి నా పేరులో ప్రతి పదం వెనుక వున్న రొద, సొద, బాధ, గాధ..!!

ఇక నన్ను నా చిన్ననాటి స్నేహితులు “రాము” అని పిలుస్తారు. కాని నా Engineering స్నేహితులకి నా ఇంటి పేరులో ఏమి కోతులాడాయో ఏమో కాని, “తాడి” అని ముద్దుగా పిలుచుకొంటారు. ఇక నా “M.Tech” స్నేహితులు మరియు నా సహోద్యోగులు “రాజా” అని పిలుచుకొంటారు.

అమెరికా కి వచ్చిన తరువాత “రాజా”, “రావు” లలో “రాజా” నా First Name గా, “రావు” నా Middle Name గా మరిపోయి, జనాలు నన్ను “రాజా తాడిమేటి” గా మార్చివేసారు. ఇక నోరు తిరగని, “జా” ని “హా” గా ఉఛ్ఛరించే Mexicans, నా పేరుని “రాహా” గా ఖూనీ చేసేస్తూంటారు. ఏది ఏమినా, సొంత ఊరుని, సొంత వారిని గుర్తుకు తెచ్చే “రాము” అనే పిలుపే నాకెంతో బావుంటుంది.

6 comments on “నా పేరు, కథా కమామీషూ..

  1. విహారి అంటున్నారు:

    మీ పేరు చరిత్ర బాగున్నది రాము గారు.

    — విహారి
    http://blog.vihaari.net

  2. కొత్త పాళీ అంటున్నారు:

    సంతోషం. స్వాగతం. 1980లలో ఆర్యీసీ వరంగల్లో మా క్లాసుమేటొకతను తాడిమేటి శ్రీనివాసరావు ఉండేవాడు.

  3. Viswanath అంటున్నారు:

    భలేగున్నవి మీ పేరుతో పాట్లు.

  4. నాగరాజా అంటున్నారు:

    నిన్ననే డాక్టరు దగ్గరికి వెళ్తే, ‘నాగరాహా’ అని స్వాగతం పలికాడు. ఇదివరకున్నంత ఓపిక లేకపోవడం వల్ల నేను అలాగే స్వీకరించాను.

  5. ఇక్కడి వాళ్లకి నా పేరు సరిగ్గా పలకడం రాక శ్రీనివాస్ బదులు ష్రీనివాస్ అనో, ష్రీను అనో పిలుస్తున్నారు.

  6. రాజారావు తాడిమేటి అంటున్నారు:

    విహారి గారూ, కొత్త పాళీ గారూ, నాగరాజా గారూ, విశ్వనాథ్ గారూ, మరియూ శ్రీనివాస్ గారూ, మీకు నా ధన్యవాదములు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s