నా పేరు, కథా కమామీషూ..

నా పూర్తి పేరు తాడిమేటి రామ శ్రీనివాస లక్ష్మీనారాయణ శివనాగ రాజారావు. కొల్లేటి చాంతాడంత ఈ పేరు పురుకోస గా మారిపోవడానికి కారణాలు తెలుసుకోవాలంటే నా అక్క పేరుతో మొదలుపెట్టాలి.

నా అక్క పేరు తాడిమేటి వెంకట సత్య నాగ దుర్గ త్రినాథ రామ లక్ష్మీ గాయత్రి. నా అక్క పేరు హాజరు పట్టీ లోను, certificates లోను ఇదే విధంగా నమోదు చేసి మా నాన్నగారికి చుక్కలు కనిపించాయి. ప్రతి certificate లోను, ప్రతి hall ticket లోను ఎప్పుడూ తన పేరు లో అచ్చు తప్పులు దొర్లటం, సరిచేయటానికి వెనక్కి పంపించటం పరిపాటి అయిపొవటంతో ఆ తప్పు మళ్ళీ చేయకూడదని నిశ్చయించుకొని, నా పేరును తాడిమేటి రాజారావు గా కుదించేసారు.

ఇక నా పేరు లో ప్రతి పదం వెనుకా ఒక చరిత్రే ఉంది. తాడిమేటి మా ఇంటి పేరు. నేను “పునర్వసు” నక్షత్రం లో పుట్టటం, అది రాములవారి నక్షత్రం కావటం చేత “రామ” అనే పదం జతపరచారు. ఆందుకే నన్ను మా ఇంటిలో అందరూ “రాము” అని పిలుస్తారు. ఇక మా కులదైవం తిరుమలేశుడైన శ్రీ శ్రీనివాసుడు పేరు నా పేరు లో మరో పదం. నా ఇద్దరు తాతగార్ల పేర్లలో ఎవరి పేరు పెడితే ఎవరికి కోపం వస్తుందోననో ఏమో “లక్ష్మీ నారాయణ” అని మా అమ్మ వాళ్ళ నాన్నగారి పేరు, “రాజారావు” అని మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు తగిలించేసారు. ఇక శివుడు మా నాన్నగారికి ఇష్టమైన దేవుడు, “నాగ” అనే పదం పేరులో చేర్చటం మా ఆచారం. ఇదండి నా పేరులో ప్రతి పదం వెనుక వున్న రొద, సొద, బాధ, గాధ..!!

ఇక నన్ను నా చిన్ననాటి స్నేహితులు “రాము” అని పిలుస్తారు. కాని నా Engineering స్నేహితులకి నా ఇంటి పేరులో ఏమి కోతులాడాయో ఏమో కాని, “తాడి” అని ముద్దుగా పిలుచుకొంటారు. ఇక నా “M.Tech” స్నేహితులు మరియు నా సహోద్యోగులు “రాజా” అని పిలుచుకొంటారు.

అమెరికా కి వచ్చిన తరువాత “రాజా”, “రావు” లలో “రాజా” నా First Name గా, “రావు” నా Middle Name గా మరిపోయి, జనాలు నన్ను “రాజా తాడిమేటి” గా మార్చివేసారు. ఇక నోరు తిరగని, “జా” ని “హా” గా ఉఛ్ఛరించే Mexicans, నా పేరుని “రాహా” గా ఖూనీ చేసేస్తూంటారు. ఏది ఏమినా, సొంత ఊరుని, సొంత వారిని గుర్తుకు తెచ్చే “రాము” అనే పిలుపే నాకెంతో బావుంటుంది.

7 comments on “నా పేరు, కథా కమామీషూ..

 1. ddddddddd అంటున్నారు:

  mee rachana saili chala bagunnayandi

 2. deepthi అంటున్నారు:

  entha chinna perandi meedi..chala bavundi 🙂

 3. Sree అంటున్నారు:

  Navvaleka chachaa.. mee peru gaadhaa vishaadam chadivi..
  Raha, Tadi.. evvi asalu sisalina Khoone Kaima perlu..
  Raja peru maatram Raja laa vundi.. entlo vaallu gomu gaa raamu anukunte ado muchata.. motham meeda tufaanu lonunchi oka teeram cherukunna naavikuni aanandam gocharinchindi mee peru lo 🙂

 4. Suresh అంటున్నారు:

  Bagaa chepparu.. tamashaaga.. meeru ilaney kummeyyandi vrayatam lo…

 5. lakshmi అంటున్నారు:

  Mee peru venuka entha antarardhama?

 6. shilpa అంటున్నారు:

  ippudu ilanti perulu levu. ardhamkani vintha ardhaalu vache vichitra perulu,palakadaniki veeluleni perule unnayi.appatlo manavarimeeda gouravamu ala undedhi.u r lucky n blessed.

 7. అజయ్ అంటున్నారు:

  Sir,
  నేను ఒక విద్యార్థి ని. నేను వేరే భాష నేర్చుకోవడానికి ఒక అప్లికేషన్ ని వాడుతున్నాను సర్. దాని పేరు Duolingo. దాంట్లో ఎవరైనా ప్రపంచంలోని ఏ భాష అయిన నేర్చుకోవచ్చు. ప్రపంచంలో చాలా మంది ఇతర దేశ భాషలు నేర్చుకుంటున్నారు, దాంట్లో మన దేశం వాళ్ళు కూడా ఉన్నారు.
  కాకపోతే మన దేశం నుండి కేవలం హింది మాత్రమే అందుబాటులో ఉంది.
  నాకు మన భాషని కూడా ఇతరులు నేర్చుకోగలిగితే బాగుంటుందని అనిపించింది.
  అందుకు నేను వారి incubator ప్రోగ్రాం కి రిజిస్టర్ చేసుకున్నాను.
  ఒక 20 మంది సంకల్పం తో ముందుకు అడుగు వేస్తే మన తెలుగు భాష ని కూడా ప్రపంచం లోని ఇతరులు కూడా నేర్చుకోవచ్చు. అందుకు నేను మీకు ఈ mail పెడుతున్నాను.

  మీరు కానీ ఇంకా ఎవరైనా భాష ప్రియులు మీకు తెలిస్తే, మీరు వారికి ఈ link లో రిజిస్టర్ చేసుకోమనండి. మనం మన తెలుగు భాష ని పరిరక్షించుకోవచ్చు.
  ఇంగ్లీష్ నుండి తెలుగు నేర్పించడానికి…..
  https://incubator.duolingo.com/apply/te/en
  తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్పించడానికి….
  https://incubator.duolingo.com/apply/en/te

  ధన్యవాదాలు,

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s